తల్లి ప్రేమకు నోచుకోని చిట్టి కోతి.. బొమ్మతోనే తన బంధం.. కన్నీళ్లు పెట్టిస్తున్న కథ

Updated on: Feb 19, 2026 | 8:00 PM

ఇచిక్వా జూలోని 'పంచ్' అనే ఆరు నెలల మకాక్ కోతి కథ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. తల్లి తిరస్కరించడంతో అనాథగా మారిన పంచ్‌కు జూ సిబ్బంది ఇచ్చిన ఒరాంగుటాన్ బొమ్మ అమ్మగా మారింది. ఆ బొమ్మను పంచ్ ఎల్లప్పుడూ తనతోనే ఉంచుకుంటూ, హత్తుకుంటూ ఉంటుంది. తల్లి ప్రేమకు నోచుకోని ఈ కోతి పిల్ల కథ నెటిజన్లను కదిలిస్తోంది, జూకు పర్యాటకుల తాకిడిని పెంచుతోంది.

జపాన్‌లోని ఇచికవా జూలో ఉన్న ‘పంచ్’ అనే ఆరు నెలల మకాక్ జాతి కోతి పిల్ల కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, జూకు పర్యాటకుల తాకిడి పెరిగేలా చేసింది. పంచ్ 2025 జూలైలో జన్మించింది. అయితే, దురదృష్టవశాత్తు పుట్టిన వెంటనే తల్లి దాన్ని తిరస్కరించింది. సాధారణంగా ఈ జాతి కోతుల తల్లులు చిన్న వయసులో ఉండడం వల్ల గానీ, లేదా ఇతర బలమైన కోతుల నుంచి ముప్పు ఉన్నప్పుడు గానీ పిల్లలను వదిలేసే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. తల్లి వదిలేయడంతో అనాథగా మారిన పంచ్‌ను జూ సిబ్బంది పెంచడం ప్రారంభించారు. కోతి పిల్లలు పుట్టినప్పటి నుంచి తల్లిని హత్తుకుని ఉండటం సహజం. ఆ స్పర్శ లేక ఆందోళన చెందుతున్న పిల్ల కోతికి ఊరట కలిగించేందుకు సిబ్బంది కొన్ని మెత్తటి సాఫ్ట్‌టాయ్స్‌ను , దుప్పట్లను ఇచ్చారు. ఆశ్చర్యకరంగా, పంచ్ వాటిలో ఒక ‘ఒరాంగుటాన్’ బొమ్మను ఎంచుకుంది. అప్పటి నుంచి ఆ బొమ్మే దానికి అమ్మైంది. నిద్రపోయేటప్పుడు దాన్ని గట్టిగా హత్తుకోవడం, ఎక్కడికి వెళ్లినా తనతో తీసుకెళ్లడం వంటి దృశ్యాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి. అమ్మ ప్రేమకు నోచుకోని ఆ చిట్టి కోతి పిల్ల, సాఫ్ట్‌ టాయ్‌లో తన తల్లిని వెతుక్కుంటున్న వైనం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నెటిజన్ల హృదయాలను కదిలిస్తోంది. ఇటీవల పంచ్‌ను ఇతర కోతుల సమూహంలోకి ప్రవేశపెట్టారు. అక్కడ ఇతర కోతి పిల్లలు తనను భయపెట్టినా, ఆటపట్టించినా.. పంచ్ ఆ బొమ్మను ఒక రక్షణ కవచంలా అడ్డుపెట్టుకుంటోందని జూ సిబ్బంది తెలిపారు. ఇతర కోతులతో కలుపుగోలుగా ఉంటున్నప్పటికీ, తన ‘బొమ్మ’ని మాత్రం పంచ్ క్షణం కూడా విడిచి పెట్టడం లేదు. వీడియోలు చూసిన నెటిజన్లు ఎమోషనల్ అయ్యారు. పంచ్ అమాయకత్వం, ఆ బొమ్మపై చూపిస్తున్న ప్రేమే ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ గా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Varanasi: వారణాసిలో ప్రకాశ్ రాజ్ క్యారెక్టర్ రివీల్.. మంచి ఛాన్స్ కొట్టేశాడుగా

ప్రియురాలిని హత్య చేసి.. ఆమె ఆత్మను పిలిచేందుకు తాంత్రిక పూజలు

పెళ్లికి అతిథిలా వచ్చాడు.. సరదాగా ఎత్తుకుపోయారు..

సాయం కావాలని ఆస్పత్రి మెట్లెక్కిన పక్షి !! చివరికి

తాళి కట్టే సమయానికి రద్దయిన వివాహం.. అసలు వాడు మగాడే కాదా?

Cow: తన బిడ్డను చంపిందని.. పులిని ఫారెస్ట్‌ అధికారులకు పట్టించిన ఆవు..

Follow Us