Oreo Bajji Video: ఇదేం బజ్జీలురా బాబూ.. ఓరియో బిస్కెట్లతో బజ్జీలు ఎగబడి తింటున్న జనం.. వీడియో వైరల్

|

Nov 15, 2021 | 9:43 AM

బయట వర్షం పడుతూ ఉంటే.. వేడి వేడిగా పకోడీలో, బజ్జీలో వేసుకొని తింటే.. అబ్బ... ఎంత బావుంటుందో...కదా.. సరే.. ఏం బజ్జీలు వేద్దాం..? అరటికాయ బజ్జీలు, ఆలూ బజ్జీ, టమాటా ఇలా ఎవరికి నచ్చిన బజ్జీలు వాళ్లు చేసుకొని తింటారు.

YouTube video player
బయట వర్షం పడుతూ ఉంటే.. వేడి వేడిగా పకోడీలో, బజ్జీలో వేసుకొని తింటే.. అబ్బ… ఎంత బావుంటుందో…కదా.. సరే.. ఏం బజ్జీలు వేద్దాం..? అరటికాయ బజ్జీలు, ఆలూ బజ్జీ, టమాటా ఇలా ఎవరికి నచ్చిన బజ్జీలు వాళ్లు చేసుకొని తింటారు. కానీ బిస్కెట్స్‌తో బజ్జీలు చేయడం ఎప్పుడైనా చూశారా.. పోనీ విన్నారా… ? మీరు విన్నది నిజమే.. బిస్కెట్ల బజ్జీనే.. సరే.. ఇప్పడు చూద్దాం ఈ బజ్జీలు ఎవరు చేశారో…ఎలా చెసారో..

అహ్మదాబాద్‌లోని ఓ స్ట్రీట్‌ ఫుడ్‌ వ్యాపారి వినూత్నంగా ఆలోచించారు. ఓరియో బిస్కెట్లతో బజ్జీలు తయారు చేస్తున్నారు. ఈ వంటకాన్నిమామూలుగా మనం చేసే పద్ధతిలోనే చేస్తున్నారు. కాకపోతే వెరైటీగా వెజిటబుల్స్‌కి బదులు ఓరియో బిస్కెట్స్‌ని వాడుతున్నారు. బిస్కెట్స్‌ని సెనగపిండిలో ముంచి ఆయిల్‌లో బంగారు రంగు వచ్చేంత వరకు వేయించేస్తున్నాడు. పైగా వీటికి.. వేయించిన పచ్చిమిర్చితోపాటు ఖర్జురం చట్నీతో సర్వ్‌ చేస్తున్నారు. ఈ వెరైటీ బజ్జీలను కార్లలో వచ్చి మరీ ఎగబడి తింటున్నారు జనం. నెట్టింట హల్‌చల్‌ చేస్తున్న ఈ వీడియోని నెటిజన్లు తెగ లైక్‌ చేస్తున్నారు.

మరిన్ని చూడండి ఇక్కడ: Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..

Ram Charan look in RRR: ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్.. సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతున్న ఫొటోస్…

Sreeleela: ఎట్రాక్ట్ చేస్తున్న అందాల చందమామ శ్రీలీల లేటెస్ట్ ఫోటోస్…

Published on: Nov 15, 2021 09:35 AM