హతవిధీ..! ఆన్‌లైన్ పేమెంట్ అతని కాపురాన్నే కూల్చేసిందిగా వీడియో
ఆన్‌లైన్ పేమెంట్ కారణంగా ఓ రెండిళ్లపూజారి గుట్టు రట్టయింది. ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు ఏ రేంజ్‌లో బయటపడుతున్నాయో నెట్టింట చూస్తూనే ఉన్నాం. అక్రమ సంబంధాల నేపథ్యంలో జనాలు క్రిమినల్స్‌గా మారిపోతున్నారా అనిపిస్తోంది. వివాహేతర సంబంధాల కోసం ప్రాణాలు తీసేస్తున్నారు. అయితే ఇలాంటిదే చైనాలో ఓ విచిత్ర సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఆన్‌లైన్ పేమెంట్ కారణంగా బయటపడిన వివాహేతర సంబంధం వారి కాపురాలను కూల్చేసింది.
అసలు ఏంజరిగిందంటే… చైనాలో గువాంగ్ డాంగ్ ప్రావిన్స్ లోని యాంగ్జియాంగ్ కు చెందిన ఓ యువకుడు తన ప్రియురాలి కోసం స్థానిక మందుల దుకాణంలో గర్భనిరోధక మాత్రలు కొనుగోలు చేశాడు. ఈ మాత్రలకు 15.8 యువాన్ల ను తన కార్డుతో చెల్లించి వెళ్లిపోయాడు. అయితే, సాంకేతిక కారణాలతో ఆ పేమెంట్ ఫెయిలైంది. దీంతో మందుల దుకాణం సిబ్బంది ఆ కార్డుతో లింక్ ఉన్న మొబైల్ నెంబర్ కు ఫోన్ చేసి విషయం చెప్పారు. ఆ యువకుడి దురదృష్టం కొద్దీ సదరు ఫోన్ కాల్ ఆయన భార్య అందుకుంది. తన భర్త ఏం కొన్నాడు, ఎందుకు పేమెంట్ ఫెయిలైందని ఆమె ఆరా తీయగా.. గర్భనిరోధక మాత్రలు కొన్నారని మెడికల్ షాప్ సిబ్బంది చెప్పారు. అయితే తనకు గర్భనిరోధక మాత్రలు అవసరమే లేనప్పుడు.. ఎవరి కోసం ఆ మాత్రలు కొన్నాడని భర్తను ఆరా తీసింది. దీంతో భర్త గారి చిన్నిల్లు వ్యవహారం బయటపడింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో విడాకులు కావాలంటూ భార్య కోర్టుకెక్కింది. ఈ విషయం మీడియాకు, తద్వారా ఆ యువకుడి ప్రియురాలి భర్తకూ చేరింది. ఇంకేముంది…ఈ వ్యవహారం ఆ కుటుంబంలోనూ చిచ్చు రేపింది. దీనిపై ప్రియురాలి భర్త కూడా విడాకుల కోసం కోర్టుకెక్కాడు. అయితే, కేవలం ఒక మందుల దుకాణం కారణంగా తన కుటుంబం విచ్ఛిన్నమైందని సదరు వ్యక్తి న్యాయపోరాటానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. కానీ, స్థానిక చట్టాల ప్రకారం ఆ యువకుడికి ఎలాంటి ప్రయోజనం ఉండదని లాయర్లు చెబుతున్నారు. ఇక ఈ వార్త నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు తమ స్టైల్‌లో రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
ఖైరతాబాద్ గణపతిని చూశారా?వీడియో
తాత నువ్వు కేక.! ఇలా కూడా వ్యాపారం చేయొచ్చా?వీడియో
కొడుకు ప్రాణాల కోసం.. మొసలితో తల్లి ఫైటింగ్ వీడియో
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
