Railway train: ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రైలులో నో టికెట్, నో ఫైన్..! ఎక్కడో తెలుసా..?

Updated on: May 12, 2022 | 8:37 PM

మన దేశంలో రైలు ప్రయాణం అంటే ఎంతో చౌకయినది..సుఖవంతమైనది..కోట్లాది మంది ప్రజలు రైళ్లలో తమ గమ్యస్థానాలకు వెళ్తుంటారు. ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్, శతాబ్ధి, హంసఫర్, గరీభ్ రథ్, వందేభారత్ వంటి ఎన్నో రకాల రైళ్లు ఉన్నాయి. ఐతే


మన దేశంలో రైలు ప్రయాణం అంటే ఎంతో చౌకయినది..సుఖవంతమైనది..కోట్లాది మంది ప్రజలు రైళ్లలో తమ గమ్యస్థానాలకు వెళ్తుంటారు. ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్, శతాబ్ధి, హంసఫర్, గరీభ్ రథ్, వందేభారత్ వంటి ఎన్నో రకాల రైళ్లు ఉన్నాయి. ఐతే వీటిలో ప్రయాణించాలంటే టికెట్ తప్పనిసరిగా ఉండాలి. కానీ మనదేశంలో టికెట్ అవసరం లేకుండా.. ఉచితంగా ప్రయాణించగలిగే.. రైలు ఒకటి ఉంది..ఆ ట్రైయిన్‌లో టికెట్‌ ఫ్రీ..ఎలాంటి ఫైన్‌ కూడా ఉండదు..అదే భాక్రా నంగల్‌ రైలు.హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ సరిహద్దుల్లో ఉన్న 13 కి.మీ. రైలు మార్గంలో ఈ ట్రైన్ నడుస్తుంది. ఇది సట్లెజ్ నది గుండా వెళుతుంది. నంగల్ నుండి ఉదయం 7గంటల 5నిమిషాలకు ఈ రైలు బ‌య‌ల్దేరుతుంది. సుమారు 8గంటల 20నిమిషాలకు ఈ రైలు భక్రా నుండి నంగల్‌కు తిరిగి వస్తుంది. నంగల్ నుండి భాక్రా డ్యామ్ చేరుకోవడానికి రైలు దాదాపు 40 నిమిషాలు నడుస్తుంది. ఈ రైలును భాక్రా బియాస్ మేనేజ్‌మెంట్ బోర్డు నిర్వహిస్తోంది. కొండకోనలు, నదుల సోయగాల మధ్య రైలు ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ రైలులో వెళ్లే ప్రయాణికుల నుంచి ఎలాంటి ఛార్జీలను వసూలు చేయరు. ఈ రైలు పూర్తిగా డీజిల్ ఇంజిన్‌తో నడుస్తుంది. రైలును ప్రారంభించినప్పుడు అందులో 10 కోచ్‌లు నడిచేవట, ప్రస్తుతం 3 కోచ్‌లు మాత్రమే ఉన్నాయి. ఈ రైలులో ఒక కోచ్‌ను పర్యాటకులకు, మరొకటి మహిళలకు కేటాయించారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే…ఈ రైలులోని అన్ని కోచ్‌లు చెక్కతో తయారు చేశారు. భాక్రా-నంగల్ ఆనకట్టను వారసత్వ సంపదగా భావిస్తారు. అందుకే ఇక్కడికి వచ్చే పర్యాటకులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Funny Video: అది లెక్క..! నిజంగా వేడు మగాడ్రా బుజ్జి.. అభినవ పరమానందయ్య శిష్యుడు..! చూస్తే పొట్టచెక్కలే..

Funny Viral video: సమ్మర్‌లో సూపర్‌ టెక్నిక్‌.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేక గాల్లో తేలిపోతారు..!

Viral Video: ఎందుకో అంత తొందర.. పెళ్లి మండపం వరకు ఆగలేక విమానంలో పెళ్లి ఆ తరువాత…

Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..

Published on: May 12, 2022 08:37 PM
Loading...
Unable to load recommendations.
Follow Us