Gas Crisis: గ్యాస్‌ కొరతే కాదు.. ఆ జిల్లాలో పెట్రోలు కూడా దొరకట్లేదు

Updated on: Mar 20, 2026 | 8:40 PM

నిర్మల్ బాసర పుణ్యక్షేత్రంలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా ఉంది. వేలాది మంది భక్తులు, స్థానికులు ఇంధనం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన ఇంధన కేంద్రంలో 'నో స్టాక్' బోర్డులు కనిపిస్తున్నాయి. రెండు రోజులుగా సరఫరా లేక బంకులు మూతపడ్డాయి. దీంతో భక్తులు చుట్టుపక్కల గ్రామాలకు ఇంధనం కోసం వెళ్తున్నారు. తిరుగు ప్రయాణంలో వాహనాలు నిలిచిపోతున్నాయి.

నిర్మల్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసరలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రరూపం దాల్చింది. నిత్యం వేలాది మంది భక్తులతో కళకళలాడే ఈ క్షేత్రంలో ఇంధనం దొరక్కపోవడంతో ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాసరలోని ప్రధాన ఇంధన కేంద్రమైన ‘శ్రీ సరస్వతి ఫిల్లింగ్ స్టేషన్’ వద్ద ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ నిల్వలు లేవని ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. గత రెండు రోజులుగా ఇంధన సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో బంకులు మూతపడ్డాయి. దీంతో సొంత వాహనాల్లో వచ్చే భక్తులు పెట్రోల్ కోసం చుట్టుపక్కల గ్రామాలకు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు, తిరుగు ప్రయాణంలో వాహనాల్లో ఇంధనం లేక నడిరోడ్డుపైనే నిలిచిపోతున్నారు. అమ్మవారి దర్శనం ముగించుకుని వెళ్దామనుకుంటే, ఇక్కడ పెట్రోల్ లేకపోవడం వల్ల ఏం చేయాలో పాలుపోవడం లేదు అని పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. నిందితుల కస్టడీపై తీర్పు వాయిదా..

మొయినాబాద్ ఎపిసోడ్ తో తెరపైకి వైట్ ఛాలెంజ్

నిరుద్యోగులకు ఏపీ సర్కార్ కానుక

Petrol Prices: భారత్ లో పెరిగిన పవర్ పెట్రోల్ ధరలు

ఆస్కార్‌ వేడుకల్లో పీసీ సందడి.. మామూలుగా లేదుగా!

Follow Us