జూ పార్క్‌లో హిప్పోల బర్త్ డే సెలబ్రేషన్స్
హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో ప్రపంచ హిప్పో దినోత్సవం ఘనంగా జరిగింది. నీటి ఏనుగుల సంరక్షణపై అవగాహన కల్పించేందుకు జూ అధికారులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. హిప్పోలకు పండ్లు, కూరగాయలతో చేసిన కేక్‌లను అందించారు. 52 ఏళ్ల వృద్ధ హిప్పో 'పార్వతి' ఆకర్షణగా నిలిచింది. ఇటువంటి వేడుకలు వన్యప్రాణుల పట్ల ప్రజల్లో ప్రేమను, అవగాహనను పెంచుతాయని అధికారులు తెలిపారు.
హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో ‘ప్రపంచ హిప్పో దినోత్సవం’ వేడుకలు ఘనంగా జరిగాయి. నీటి ఏనుగుల సంరక్షణ, వాటి విశిష్టతపై సందర్శకులకు అవగాహన కల్పించేందుకు జూ అధికారులు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హిప్పో ఎన్‌క్లోజర్ వద్ద పండుగ వాతావరణం నెలకొంది. జూలో ఉన్న పార్వతి, రాజిత, గజిని, రామ అనే నాలుగు హిప్పోల కోసం అధికారులు ప్రత్యేకంగా తయారు చేసిన కేక్‌లను అందించారు. పండ్లు, కూరగాయలతో సిద్ధం చేసిన ఈ కేక్‌లను హిప్పోలు ఎంతో ఇష్టంగా ఆరగించడం సందర్శకులను, ముఖ్యంగా చిన్నారులను విశేషంగా ఆకట్టుకుంది. కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ క్యూరేటర్ జె.మురళీధర్ ఏం చెప్పారంటే.. హిప్పోలు ఆఫ్రికా ఖండానికి చెందిన అర్ధజల శాకాహార జంతువులని తెలిపారు. ఇవి రోజుకు సుమారు 100 కిలోల వరకు ఆహారాన్ని తీసుకుంటాయన్నారు. ఈ సందర్భంగా జూలో ఉన్న 52 ఏళ్ల ‘పార్వతి’ అనే హిప్పో గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేశంలోని జూ పార్కుల్లో ఉన్న అత్యంత వృద్ధ హిప్పోలలో పార్వతి ఒకటని, వయసు పెరిగినా అది చాలా ఆరోగ్యంగా ఉందని అధికారులు తెలిపారు. వన్యప్రాణుల రక్షణలో భాగంగా ఇటువంటి వేడుకలు నిర్వహించడం వల్ల జంతువుల పట్ల ప్రజలకు ప్రేమ, అవగాహన పెరుగుతాయని అధికారులు అభిప్రాయపడ్డారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డ్రై క్లీనర్ మంత్లీ ఇన్‌కం.. రూ.2 లక్షలు నెట్టింట వైరల్‌గా పోస్ట్!
గిన్నిస్ రికార్డు సృష్టించిన భారీ పాము: చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే
నీళ్లా.. అని లైట్ తీసుకోకండి.. విషయం తెలిస్తే షాకే
