Viral Video: శివలింగాన్ని ప్రతిష్టించడంలో.. ముస్లిం వ్యక్తి కిరాక్‌ ఐడియా.! సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..

|

Mar 03, 2022 | 8:51 PM

మధ్యప్రదేశ్‏లోని మందసౌర్‏లో ఉన్న ప్రసిద్ధ పశుపతి నాథ్ మహాదేవ్ ఆలయంలో సహస్త్రేశ్వర్ మహాదేవ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ శివలింగాన్ని జలధారి అంటారు. జలధారి అంటే.. నీటితో ప్రతిష్టించిన అని అర్థం. ఇందుకోసం ఓ భారీ క్రేన్ సహాయం కూడా తీసుకున్నారు. ఈ పనికోసం


మధ్యప్రదేశ్‏లోని మందసౌర్‏లో ఉన్న ప్రసిద్ధ పశుపతి నాథ్ మహాదేవ్ ఆలయంలో సహస్త్రేశ్వర్ మహాదేవ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ శివలింగాన్ని జలధారి అంటారు. జలధారి అంటే.. నీటితో ప్రతిష్టించిన అని అర్థం. ఇందుకోసం ఓ భారీ క్రేన్ సహాయం కూడా తీసుకున్నారు. ఈ పనికోసం పీడబ్ల్యూడీ, పీహెచ్ఇ జిల్లా పంచాయితీతో సహా అన్ని శాఖల ఇంజనీర్లు రంగంలోకి దిగారు. అయితే జిలహారిపై శివలింగాన్ని ఎలా ప్రతిష్టించాలనేది అందరి ముందు పెద్ద సవాలుగా మారింది. ఇందుకు ఇంజనీర్లు సైతం సరైన పరిష్కారం కనిపెట్టలేకపోయాడు. కానీ ఈ సమస్యకు ఓ ముస్లిం వ్యక్తి దేవుడిని ప్రతిష్టించే బాధ్యతను తీసుకున్నాడు. ఆ శివలింగం సహస్త్రేశ్వర్ రూపంలో చాలా ప్రత్యేకమైన ఆకృతిలో ఉంటుంది. అయితే దీని పొడవు 6.50 అడుగులు ఉంటుంది. బరువు రెండున్నర టన్నులు. ఈ శివలింగం ఏర్పాటు వెనక ఆసక్తికరమైన కథ ఉంది. ఈ శివలింగం ప్రతిష్టించే సమయంలో ఇంజనీర్లకు పెద్ద సవాలు ఎదురైంది. ఈ సమస్యలతో పోరాడుతున్న ఇంజనీర్లకు అక్కడే కూలీగా పని చేస్తున్న మక్బూల్‌ శివలింగాన్ని ప్రతిష్టించేందుకు మార్గాన్ని చూపించాడు. దీంతో ఆ ఇంజనీర్లు ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. మక్బూల్ ఎప్పుడూ పాఠశాలకు వెళ్లలేదు. అతనికి చదువు రాదు. కానీ తన పని అనుభవం ఆధారంగా ఆ సమస్యను పరిష్కరించాడు. జిలహారీలో శివలింగాన్ని ప్రతిష్టించే ప్రదేశంలో ఒక ఐస్‌ను ఉంచితే జిలహారీకి ఎలాంటి హాని ఉండదని.. శివలింగాన్ని కూడా సురక్షితంగా ప్రతిష్టించవచ్చని మక్బూల్ చెప్పాడు. మంచు కరగడంతో స్వామివారి శివలింగం జిలహారిలోకి ప్రవేశించి ప్రతిష్టించనుందని సూచించాడు.

మరిన్ని చూడండి ఇక్కడ:
Puneeth Rajkumar-James: ఆయనకి సాటి మరొకరు లేరు.. అభిమానుల గుండెల్లో చిరస్థాయి.. వైరల్ అవుతున్న చివరి సినిమా పోస్టర్స్…

Rana Daggubati: విభిన్న పాత్రలకి కేరాఫ్ అడ్రస్ ఆయన.. బళ్లాళ దేవ అయినా.. డానియెల్ శేఖర్ అయినా..! ట్రెండ్ మార్చిన ‘రానా’ ఫొటోస్

Rashmika Mandanna: కొంటె చూపులతో కవ్విస్తున్న ‘శ్రీవల్లి’.. గ్లామర్ డోస్‌లో ‘తగ్గేదేలే’.. ఎట్రాక్ట్ చేస్తున్న ఫోటోలు..

Jacqueline Fernandez: అబ్భురపరిచే వయ్యారాలతో చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ ‘జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌’..ఫొటోస్

Follow us on