అమ్మ ప్రేమ అంటే అంతే.. మనిషికైనా పిల్లికైనా
ప్రతి తల్లి కూడా తన పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. మాతృత్వం విషయంలో మనుషులే కాదు, జంతువులు కూడా ఎంతో బాధ్యతగా ఉంటాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో నెటిజన్లను ఫిదా చేస్తుంది. సాధారణంగా చిన్న పిల్లలు ఇంటి బయట అడుతుంటే..
ప్రతి తల్లి కూడా తన పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. మాతృత్వం విషయంలో మనుషులే కాదు, జంతువులు కూడా ఎంతో బాధ్యతగా ఉంటాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో నెటిజన్లను ఫిదా చేస్తుంది. సాధారణంగా చిన్న పిల్లలు ఇంటి బయట అడుతుంటే.. తల్లులు కంగారు పడిపోవడమే కాక వెంటనే తమ చిన్నారులను ఎత్తుకుని ఇంట్లోకి తెచ్చేస్తుంటారు. అచ్చం అలాగే చేసింది ఓ పిల్లి. అందుకు సంబంధించిన వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. వైరల్ అవుతున్న పిల్లి వీడియోలో.. ఓ తల్లి పిల్లి తన బిడ్డను ‘వీధిలో ఆడుకుంది చాలు.. ఇక ఇంటికి పదా’ అన్నట్లుగా ఎక్కడ నుంచో నోటితో పట్టుకుని తీసుకురావడం కనిపిస్తుంది. అది తన బిడ్డను ఎక్కడ నుంచి తీసుకువస్తుందో తెలియదు కానీ చిన్ని పిల్లి రక్షణ కోసమే ఆ తల్లి ఆరాటం అని మాత్రం అర్థమవుతోంది. చూడడానికి ఎంతో అందంగా ఉన్న ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. పిల్లలు ఎంత పెద్దయినా తల్లిదండ్రులకు చిన్నవాళ్లేనని.. ఇంట్లోకి రమ్మని అమ్మ పిలిస్తే వెంటనే వెళ్లాలి, వెళ్లకపోతే ఇంతే సంగతి.. అంటూ రాసుకొస్తున్నారు. మరోవైపు ఈ వీడియోకు ఇప్పటివరకు 21 లక్షలకుపైగా వ్యూస్ లభించాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒక్క రోజులో రూ.73 లక్షల షాపింగ్ చేసిన భార్య !!
మాయం కానున్న నక్షత్రాలు.. ఇప్పుడే తనివితీరా చూసేయండి
కుక్కల కోసం స్పెషల్ ఊయల.. కిర్రాక్ ఐడియా..
ఈ రాయిని మండించండి.. వైఫై సిగ్నల్ తన్నుకుంటూ వస్తుంది
30 లక్షలమందిని ఇంప్రెస్ చేసిన దోశ.. తింటే వదలరు