ఆహా.. మండుటెండలో వానరాల జలకాలాటలు.. చూడాల్సిందే

Edited By:

Updated on: May 07, 2026 | 12:52 PM

దేశవ్యాప్తంగా ఎండలు మండుతుండగా, వేడి నుండి ఉపశమనం పొందేందుకు కోతులు నీటి గిన్నెలో జలకాలు ఆడుతున్న వీడియో వైరల్ అవుతోంది. మనుషులు ఏసీల్లో ఉంటే, ఈ వానరాలు నీటిలో మునిగి సేదతీరాయి. ఈ వీడియో నెటిజన్లను అలరిస్తోంది. వేసవిలో మూగజీవాలకు నీటిని అందించాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు. ఈ వైరల్ దృశ్యం వేసవి తాపానికి జంతువుల పాట్లను గుర్తు చేస్తుంది.

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. వేసవి తాపం, వడగాల్పులతో ప్రజలు అల్లాలుడుతున్నారు. మనుషుల పరిస్థితే ఇలా ఉంటే ఇక మూగజీవాల సంగతి చెప్పనక్కరలేదు. వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం వన్యప్రాణులు జనావాసాల్లోకి చొరబడుతుంటాయి. తాజాగా కొన్ని కోతులు ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తూ వైరల్‌గా మారింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో, ఎండ వేడి తాళలేక కొన్ని కోతులు నీటితో ఉన్న ఒక పెద్ద దబరా గిన్నెను ఆశ్రయించాయి. ఎవరో తమ ఇంటి పనుల కోసం నీటితో నింపి పెట్టుకున్న ఆ గిన్నెను తమకోసమే ఏర్పాటు చేసిన స్విమ్మింగ్ పూల్‌లా.. భావించి.. ఒక్కొక్కటిగా అందులోకి దూకుతూ జలకాలాడుతూ సేదతీరాయి. నీటిలో మునుగుతూ, లేస్తూ, ఒకదానిపై ఒకటి నీళ్లు చల్లుకుంటూ అవి చేసిన అల్లరి చూడాల్సిందే. మనుషులం ఏసీలు, కూలర్ల కింద ఉపశమనం పొందుతుంటే, ఈ వానర సైన్యం మాత్రం ఇలా నీటిలో మునిగి ‘చిల్’ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “పాపం వీటికి కూడా ఎండ దెబ్బ బాగా తగిలినట్టుంది”, “వీటి ఆనందం చూస్తుంటే ముచ్చటేస్తోంది” అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అదే సమయంలో, మండుతున్న ఈ ఎండల్లో పక్షులు, జంతువుల కోసం మీ ఇంటి డాబాల పైన లేదా ఆవరణలో ఇలా నీటి కుండలను ఉంచాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు. మొత్తానికి వేసవి తాపానికి కోతులు పడ్డ ఈ పాట్లు ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతున్నాయి!

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కోహినూర్‌ భారత్‌దే… తిరిగివ్వమని అడుగుతా

పాపం! కృష్ణరాజు సొంత కొడుకు.. ఎలా చనియాడో తెలుసా

తామర ఆకులనే ఫేస్‌ మాస్క్‌లుగా..! వేసవిలో వైరల్ ట్రెండ్

విమానం ఎక్కేముందు ప్రతీసారీ.. వారికి నోట్‌ పంపుతానన్న ఆమిర్‌

Trisha: అసెంబ్లీ బరిలో త్రిష ?? విజయ్ వదిలేసే స్థానం నుంచి పోటీ..!

Published on: May 06, 2026 07:35 PM
Loading...
Unable to load recommendations.
Follow Us