చెట్టుపైనుంచి నోట్ల వర్షం కురిపించిన కోతి.. వానరం ఎంత పని చేసింది!
ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో ఓ కోతి రూ.2 లక్షల నగదున్న బ్యాగును లాక్కెళ్లి చెట్టుపైకి ఎక్కింది. బ్యాగు తెరిచి వంద, ఐదు వందల నోట్ల కట్టలను గాల్లోకి విసరడంతో అక్కడ నోట్ల వర్షం కురిసినట్లైంది. జనం నోట్లు ఏరుకునేందుకు పరుగులు తీయగా, సీసీటీవీలో రికార్డైన ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చివరకు ఎక్కువ మొత్తంలో డబ్బు తిరిగి దక్కడంతో బాధితుడు ఊపిరి పీల్చుకున్నాడు.
మనదేశంలో కోతుల అల్లరి, అవి చేసే వింత పనులు కొన్నిసార్లు నవ్వు తెప్పిస్తే, మరికొన్నిసార్లు పెద్ద తలనొప్పిగా మారుతుంటాయి. సాధారణంగా కోతులు చేతిలో ఉన్న పండ్లు, తినుబండారాలు లేదా కూరగాయల బ్యాగులను లాక్కెళ్లడం చూస్తుంటాం. ఉత్తర ప్రదేశ్‌లోని బులంద్‌షహర్ రిజిస్ట్రీ ఆఫీసు ఆవరణలో ఒక వింత ఘటన వెలుగుచూసింది. ఒక కోతి హఠాత్తుగా వచ్చి ఓ వ్యక్తి చేతిలోని బ్యాగును లాక్కొని చకచకా చెట్టుపైకి ఎక్కేసింది. ఆ బ్యాగులో ఏకంగా రెండు లక్షల రూపాయల క్యాష్ ఉంది. చెట్టుపై కూర్చున్న ఆ కోతి బ్యాగును తెరిచి, అందులోని వంద, ఐదు వందల నోట్ల కట్టలను గాల్లోకి విసిరేయడం ప్రారంభించింది. నోట్ల వర్షం కురుస్తున్నట్లుగా డబ్బులు కింద పడుతుంటే, అక్కడ ఉన్న జనం ఆ నోట్లను ఏరుకోవడానికి పరుగులు తీశారు. ఆ దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అవ్వగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బులంద్‌షహర్ నగరంలోని రిజిస్ట్రీ ఆఫీస్ ఆవరణలోకి ఒక వ్యక్తి ఆస్తి రిజిస్ట్రేషన్ పనుల నిమిత్తం భారీ క్యాష్‌తో వచ్చాడు. అతను తన చేతిలో రూ. 2 లక్షల క్యాష్ ఉన్న బ్యాగును పట్టుకుని నడుచుకుంటూ వెళ్తుండగా, అక్కడ పొంచి ఉన్న ఒక కోతి హఠాత్తుగా అతని పైకి దూకింది. ఆ వ్యక్తి తేరుకునే లోపే అతని చేతిలోని డబ్బుల బ్యాగును లాక్కొని, క్షణాల వ్యవధిలో పక్కనే ఉన్న ఒక పెద్ద చెట్టు పైకి ఎక్కేసింది. తన కళ్ల ముందే రూ. 2 లక్షల నగదున్న బ్యాగు కోతి పరం అవ్వడంతో ఆ బాధితుడు లబోదిబోమంటూ గట్టిగా కేకలు వేశాడు. అతని అరుపులు విని చుట్టుపక్కల ఉన్న జనం, లాయర్లు అక్కడికి చేరుకున్నారు. అంతా కలిసి కోతిని కిందకు దించడానికి ప్రయత్నిస్తుండగా.. ఆ కోతి బ్యాగు జిప్ తీసి లోపల ఉన్న నోట్ల కట్టలను బయటకు తీసింది. అది తినే వస్తువు కాదని గ్రహించిందో ఏమో కానీ, నోట్ల కట్టలను ఒక్కొక్కటిగా విప్పి గాల్లోకి విసరడం ప్రారంభించింది. వంద రూపాయలు, ఐదు వందల రూపాయల నోట్లు చెట్టుపై నుంచి కురుస్తున్న వర్షంలా కింద పడటాన్ని చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. కొందరు ఆ నోట్లను పట్టుకోవడానికి, కింద పడిన వాటిని ఏరుకోవడానికి పోటీ పడ్డారు. ఈ గందరగోళం మధ్య బాధితుడు, కొంతమంది మంచి వ్యక్తులు కలిసి కోతి విసిరేసిన నోట్లను ఎంతో కష్టపడి తిరిగి సేకరించారు. రిజిస్ట్రీ ఆఫీసు పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలో ఈ దృశ్యాలన్నీ రికార్డయ్యాయి. కోతి బ్యాగు లాక్కెళ్లడం, చెట్టుపై నుండి నోట్లను విసిరేయడం, జనం వాటి వెనుక పరుగులు తీయడం.. ఈ వీడియోలన్నీ నెట్టింట విపరీతమైన లైకులు, కామెంట్లతో దూసుకుపోతున్నాయి. ఈ కోతికి బ్యాంక్ అకౌంట్ లేనట్టుంది, అందుకే అందరికీ పంచేస్తోంది అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. అదృష్టవశాత్తూ చాలా వరకు డబ్బులు తిరిగి దక్కడంతో బాధితుడు ఊపిరి పీల్చుకున్నాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏఐ వద్దు.. ఉద్యోగులే ముద్దు.. పెరిగిన ఏఐ ఖర్చు.. కంపెనీల పునరాలోచన
రోడ్డుపై కరెన్సీ నోట్లు విసిరేసి.. ఓ రేంజ్‌లో పోలీస్ దొంగా ఛేజింగ్
90 ఏళ్ల అత్తగారిని బుట్టలో కూర్చోబెట్టి.. నెత్తిన పెట్టుకుని కోడలి పాదయాత్ర!
పక్క ఫ్లాట్‌ను దొంగచాటుగా రికార్డ్ చేస్తూ పట్టుబడ్డ వృద్ధుడు
