Monkey Reaction: విచిత్రమైన హెయిర్‌స్టైల్ చూసి.. మంకీ రియాక్షన్ మామూలుగా లేదుగా.!వీడియో

Updated on: Nov 10, 2022 | 8:33 PM

‘పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి’ అని అంటుంటారు. సమాజంలో ఉన్న కొందరిని చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తోంది. నలుగురు ఒక దారిలో వెళితే వారు మరో దారిలో వెళుతుంటారు. నలుగురు చేసే పని మేము చేయమంటూ వెరైటీగా ఏదో ఒకటి చేసి వార్తల్లో నిలుస్తుంటారు.


సోషల్ మీడియా పుణ్యామాని ఇలాంటి వింత వ్యక్తులు ఇటీవల ప్రపంచానికి ఎక్కువగా పరిచయమవుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి విచిత్ర హెయిర్‌స్టైల్ చూసి షాక్ తిన్న కోతి ఇచ్చిన రియాక్షన్ నెటిజన్లే ఖంగుతిన్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైర‌ల‌వుతోంది. ఈ వీడియోలో క్యాప్ ధ‌రించిన వ్యక్తి ప‌క్క‌న మంకీ కూర్చుని ఉండ‌గా, అత‌డు క్యాప్ తీయ‌గానే విచిత్రమైన హెయిర్‌స్టైల్ క‌నిపిస్తుంది. అత‌డి హెయిర్‌స్టైల్‌ను చూసిన మంకీ షాక్‌కు గురై షేక్ అయ్యింది. ఈ వీడియో చూసి నెటిజన్లు తెగ ముచ్చటపడుతున్నారు. మంకీ రియాక్షన్ వేరే లెవెల్‌లో ఉంది మరీ. ఈ వీడియోపై రకరకాలు కామెంట్స్ చేస్తున్నారు చూసివాళ్లు.. ఏడాది పాటు తాను హెయిర్ క‌ట్ చేయించిక‌పోవ‌డంతో త‌న త‌ల్లి కూడా ఇదే త‌ర‌హాలో రియాక్ట్ అయింద‌ని ఓ యూజ‌ర్ కామెంట్స్‌లో రాసుకొచ్చాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girls Fighting: రెచ్చిపోయి చిత్తు చిత్తుగా నడిరోడ్డుపై కొట్టుకున్న ఇద్దరు అమ్మాయిలు.. మధ్యలో యువకుడు బలి..వీడియో.

Parrot: ఈ చిలుక పెద్ద ముదురు.. వాట్సాప్ చాట్ కుమ్మేస్తోందిగా.. ఇష్టమైన వారికి వీడియోకాల్‌ కూడా..

Mobile Robbery: మొబైల్‌ కొట్టేసిన దొంగ.. క్షణంలో మైండ్‌ బ్లాకింగ్‌ సీన్‌..! ఇదే పనిష్మెంట్..

Published on: Nov 10, 2022 08:33 PM
Loading...
Unable to load recommendations.
Follow Us