స్నేహమంటే ఇదేరా..55 ఏళ్లుగా ఇవి బెస్ట్ ఫ్రెండ్స్ వీడియో
స్నేహం మనుషుల మధ్యే కాదు జంతువుల మధ్య కూడా ఉంటుందా? ఒకటి కాదు రెండు కాదు 55 ఏళ్లుగా అవి దోస్త్‌లుగా ఉంటూ కలిసి మెలిసి తిరుగుతున్నాయి. స్నేహమేరా జీవితం భామ, కామాక్షి మధ్య విడదీయలేని బంధం ఏర్పడింది. నిద్రపోవడం, వాకింగ్‌కు వెళ్లడం దగ్గర నుంచి అన్ని పనుల్లోనూ కలిసే చేస్తాయి. ఊసులు చెప్పుకుంటూ చెరకుగడలు తినడం వీటికి నచ్చిన పని. అందుకే 30 ఏనుగులు ఉన్న తెప్పకాడు శిబిరంలో భామ, కామాక్షిలు ప్రత్యేకమని ఐఎఫ్‌ఎస్ అధికారిణి సుప్రియా సాహూ చెబుతున్నారు. ఇంట్రెస్టింగ్ స్టోరీని ఆమె ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఏనుగుల స్నేహం గురించి తెలుసుకున్న యానిమల్ లవర్స్ ఆశ్చర్యపోతున్నారు. ఏనుగుల సగటు జీవితకాలం 70 సంవత్సరాలు. కొన్ని వందేళ్ల వరకు జీవిస్తాయి. ఇప్పుడు భామకు 75 , కామాక్షికి 65 అంటే సగానికి పైగా జీవితకాలంలో మంచి ఫ్రెండ్స్‌గా ఉన్నాయి. ఏనుగులు హృదయాలను ద్రవింపజేసే స్నేహ బంధాన్ని పంచుకుంటాయని ఎవరూ అనుకోరని సుప్రియా సాహు రాసుకొచ్చారు. ఒకసారి భామను అడవిలోకి మేతకు తీసుకెళ్లిన మావటిపై చిరుతపులి దాడి చేసిందట. భామ ఆ చిరుతపులిని తరిమికొట్టి మావటి ప్రాణాన్ని కాపాడిందట. అలాగే కామాక్షిపై ఒకసారి ఓ మగ ఏనుగు దాడి చేసిందట. దాని గాయాలు నయమవ్వడానికి సంవత్సరాలు పట్టింది కానీ అది ధైర్యంగానే ఉందనీ సుప్రియా సాహు రాసుకొచ్చారు. క్యాంప్ మీల్ టైమ్‌లో కూడా భామ, కామాక్షి కలిసే ఉంటాయి. వాటికి చెరకు చాలా ఇష్టం, ఒక దానికి మాత్రమే చెరకు ఇవ్వడానికి ఎవరూ ధైర్యం చేయరు. ఎప్పుడూ రెండిటికీ కలిపి ఇస్తారని సుప్రియ తెలిపారు. వీటి సంరక్షణ బాధ్యత వహిస్తున్న క్యాంపు అధికారుల కృషిని కూడా ఆమె ప్రశంసించారు.
మరిన్ని వీడియోల కోసం :
రాత్రిపూట ఈ లక్షణాలు కనిపిస్తే లివర్ షెడ్డుకే వీడియో
ఈ వయసులో పెళ్లి చేసుకుంటేనే.. ఆ విషయంలో హ్యాపీ వీడియో
మహాశివుని పాదాలను తాకిన గంగమ్మ కనువిందు చేస్తున్న దృశ్యాలు
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్ దృశ్యం..
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం
ప్రశాంతమైన మరణానికి మార్గం సుగమం!!
రైల్లో రెచ్చిపోయిన కొత్తజంట.. దెబ్బకు టీసీ ఉద్యోగం ఊస్ట్!
ఈసీజీ కూడా కనిపెట్టలేనిది.. ఏఐ కనిపెట్టేసిందిగా!

