మురుగు కాలువలో 15 అడుగుల గిరి నాగు.. చూసి వణికిపోయిన గ్రామస్తులు
విజయనగరం జిల్లా వీలుపర్తి గ్రామంలో మురుగు కాలువలో 15 అడుగుల భారీ గిరినాగు కలకలం సృష్టించింది. వింత శబ్దాలతో గుర్తించిన గ్రామస్థులు భయభ్రాంతులయ్యారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ గంటకు పైగా శ్రమించి, ప్రాణాలకు తెగించి పామును బంధించి సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. గ్రామస్థులు ఊపిరి పీల్చుకుని, స్నేక్ క్యాచర్‌ను అభినందించారు.
సాధారణంగా మురుగు కాలువల్లో నీటి ప్రవాహం శబ్దం వినిపిస్తుంది. కానీ విజయనగరం జిల్లా వీలుపర్తి గ్రామంలోని వెలమల వీధిలో మాత్రం స్థానికులకు వింత శబ్దాలు వినిపించాయి. ఏంటా అని వెళ్ళి చూసిన గ్రామస్థులకు ఊహించని షాక్ తగిలింది. అక్కడ సుమారు 15 అడుగుల పొడవైన భారీ గిరినాగు తిష్ట వేసి ఉంది. పదిహేను అడుగుల పొడవుతో, భయంకరంగా బుసలు కొడుతున్న ఆ గిరినాగును చూసి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. కొద్దిసేపట్లోనే విషయం గ్రామం అంతా పాకడంతో జనం భారీగా అక్కడికి చేరుకున్నారు. గ్రామస్థుల సమాచారంతో అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ పామును పట్టుకునేందుకు ప్రయత్నించగా ఆ భారీ సర్పం అతనికి చుక్కలు చూపించింది. గిరినాగును బంధించే క్రమంలో అది ఎదురుదాడి చేస్తూ బుసలు కొట్టడంతో స్థానికులు భయం భయంగా చూస్తుండిపోయారు. సుమారు గంటకు పైగా స్నేక్ క్యాచర్‌ను ముప్పుతిప్పలు పెట్టిన ఆ గిరినాగు, ఎట్టకేలకు స్నేక్ క్యాచర్‌కి చిక్కక తప్పలేదు. దానిని అత్యంత చాకచక్యంగా సంచిలో బంధించి సురక్షితంగా దానిని అటవీప్రాంతంలో వదలిపెట్టారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రాణాలకు తెగించి భారీ సర్పాన్ని పట్టుకున్న స్నేక్ క్యాచర్‌ను గ్రామస్థులు అభినందించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఓవైపు నిప్పుల కొలిమి..మరోవైపు పిడుగుల వాన.. ఏపీలో వింత వాతావరణం
పెరట్లో పనిచేసుకుంటున్న వ్యక్తి.. వెనుక ఉన్నది చూసి షాక్
ఏపీ తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్‌గా కల్పన రికార్డు
