రెప్పపాటులో తప్పిన పెను ప్రమాదం..
ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలు, ఈదురుగాలుల మధ్య ఘన్‌సోలీ సెక్టార్-10లో నిర్మాణంలో ఉన్న భవనం వద్ద భారీ ఇనుప షీట్లు కుప్పకూలాయి. అదృష్టవశాత్తూ ఘటన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వర్షాకాలంలో నిర్మాణ ప్రాంతాలు, హోర్డింగ్‌లు, తాత్కాలిక షీట్ల సమీపంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.
ముంబై మహానగరాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీవర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ నేపథ్యంలో నగరంలోని ఘన్‌సోలీ సెక్టార్-10లో నిర్మాణంలో ఉన్న ఒక భవనం వద్ద భారీ ప్రమాదం తృటిలో తప్పింది. సెక్టార్-10లో నిర్మాణంలో ఉన్న భవనం చుట్టూ రక్షణ కోసం ఏర్పాటు చేసిన భారీ ఇనుప షీట్లు.. గాలుల ధాటికి ఒక్కసారిగా కుప్పకూలి రోడ్డుపైన పడ్డాయి. అదృష్టవశాత్తూ ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. నిత్యం రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో.. అదే సమయంలో పాదచారులు లేదా వాహనదారులు ఎవరైనా వెళ్లి ఉంటే ఆ ఇనుప షీట్ల కింద నలిగి ప్రాణాలు కోల్పోయేవారు. తృటిలో ఎంత ప్రమాదం తప్పిందని స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. క్షణం ఆలస్యమైతే ఘోరం జరిగిపోయేది అంటూ అక్కడి వారు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయంతో వణికిపోయారు. వర్షాకాలంలో బలమైన గాలుల కారణంగా నిర్మాణ ప్రాంతాల వద్ద ఏర్పాటు చేసే తాత్కాలిక షీట్లు, పెద్ద పెద్ద హోర్డింగ్‌లు, సైన్ బోర్డులు కుప్పకూలే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ప్రజలు ముఖ్యంగా వర్షం పడే సమయంలో ఇలాంటి నిర్మాణ స్థలాలకు దూరంగా, చాలా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రాజస్థాన్‌లో రాక్షసకాండ! 13 ఏళ్ల బాలికపై 30 మంది మృగాళ్ల అరాచకం
వామ్మో.. రక్త జలపాతం.. వందేళ్ల మిస్టరీని ఛేదించిన శాస్త్రవేత్తలు!
వరంగల్‌లో ప్లాస్టిక్ పార్క్.. చెత్తతో అద్భుతాలు!
అద్భుతం.. పెంకులేని గుడ్డునుంచి కోడిపిల్ల పుట్టింది!
శ్రీవారి వైభోగం..! జూన్‌లో రూ.128.29 కోట్ల ఆదాయం.. వేసవిలో ఆల్‌టైమ్ రికార్డ్!
