ప్రియుడే కావాలన్న భార్య.. వారించినా వినకపోవడంతో భర్త ఏం చేశాడంటే ??
ప్రియుడితో తన భార్య అక్రమ సంబంధం కొనసాగిస్తోందని తెలిసిన ఓ భర్త తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. మందలించినా కూడా భార్య బుద్ధి మారకపోవడంతో నీటి గుంటలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అంతకు ముందు తన ఆత్మహత్యకు గల కారణాలు వివరిస్తూ సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకెళితే.. చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలో జరిగింది ఈ విషాదం . తన భార్య మరో వ్యక్తితో తరచూ ఫోన్ లో మాట్లాడుతూ దొరికిపోవడంతో ఇద్దరి మధ్య గత కొన్ని రోజులుగా మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే భార్యపై అనుమానంతో నిలదీశాడు. చివరికి అవమాన భారంతో కుంగిపోయిన భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. గుంటుపల్లికి చెందిన 38 ఏళ్ల మోహనాచారి తన భార్యను సురేంద్ర అనే సచివాలయ ఉద్యోగి ట్రాప్ చేశాడని సెల్ఫీ వీడియోలో తెలపడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న భార్య ప్రేమాయణంపై మోహనాచారి నిలదీశాడు. దీంతో కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి భార్యాభర్తలు గొడవ పడ్డారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్.. కానీ ఇక్కడ ట్విస్ట్ తెలిస్తే మీ మతిపోతుంది !!