ప్రాణాలను కాపాడిన.. రియల్‌ “హీరో” ఈ ఎలుక !!

Updated on: May 08, 2026 | 12:21 PM

మగావా, ఒక ఆఫ్రికన్ జెయింట్ పౌచ్డ్ రాట్, కంబోడియాలో వేలాది మంది ప్రాణాలను కాపాడిన వీర ఎలుక. ల్యాండ్‌మైన్‌లను గుర్తించే ప్రత్యేక శిక్షణ పొంది, తన ఐదేళ్ల కెరీర్‌లో 71 ల్యాండ్‌మైన్‌లను, 38 పేలుడు పదార్థాలను కనుగొని 1.41 లక్షల చదరపు మీటర్ల స్థలాన్ని సురక్షితం చేసింది. ఈ అసాధారణ సేవలకు గుర్తింపుగా PDSA గోల్డ్ మెడల్ అందుకున్న తొలి ఎలుకగా నిలిచింది. మగావా జీవితం చిన్న జీవి ఎంత పెద్ద మార్పు తీసుకురాగలదో నిరూపించింది.

సాధారణంగా ఎలుకలను మనం ఇబ్బంది కలిగించే జంతువులుగానే చూస్తాం. కానీ, ఒక ఎలుక మాత్రం తన ప్రాణాలకు తెగించి వేలాది మంది మనుషుల ప్రాణాలను కాపాడి ప్రపంచంలోనే అత్యంత సాహస ఎలుకగా గుర్తింపు పొందింది. మగావా ఒక ఆఫ్రికన్ జెయింట్ పౌచ్డ్ రాట్. టాంజానియాకు చెందిన APOPO అనే స్వచ్ఛంద సంస్థ దానికి ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. ఎలుకకు వాసన పసిగట్టే అద్భుత శక్తి ఉందని తెలుసుకుని పేలుడు పదార్థాల్లోని రసాయనాలను కనిపెట్టేలా శిక్షణ ఇచ్చింది . కంబోడియాలో యుద్ధ సమయంలో అమర్చిన ప్రమాదకర ల్యాండ్‌మైన్లను కనిపెట్టడంలో మగావా కీలక పాత్ర పోషించింది. మగావా కేజీ బరువు, 70 సెంటీమీటర్ల ఎత్తు ఉండేది. మగావా గొప్ప బలం ఉండేది. దాని శరీరం తేలికగా కదులుతుంది. అది ఎంత తేలికగా ఉండేదంటే, ల్యాండ్‌మైన్‌ల మీద నడిచినా కూడా అవి పేలేవి కావు. మగావాను ఒక తాడుకు కట్టి, ఒక ప్రాంతమంతా అటూ ఇటూ నడిపించేవారు. గన్‌పౌడర్ వాసన రాగానే, అది నేలను గోకి తనను నడిపించే వ్యక్తికి సంకేతం అందించేది . ఘాటైన వాసనలను గుర్తించడం, వినికిడి శక్తి, ఇంకా చురుకుదనం మగావాను హీరోగా నిలబెట్టింది. మగావా తన ఐదేళ్ల కెరీర్‌లో 71 ల్యాండ్‌మైన్లను, 38 పేలుడు పదార్థాలను గుర్తించింది. దాదాపు 20 ఫుట్‌బాల్ మైదానాలతో సమానమైన 1.41 లక్షల చదరపు మీటర్ల స్థలాన్ని ల్యాండ్ మైన్స్‌ లేకుండా క్లియర్‌ చేయడంలో సహాయపడింది. మనుషులు మెటల్ డిటెక్టర్లతో గంటల కొద్దీ చేసే పనిని, మగావా కేవలం 20 నిమిషాల్లోనే పూర్తి చేసేది. మగావా చేసిన అసాధారణ సేవలకు గుర్తింపుగా బ్రిటన్‌కు చెందిన ప్రముఖ స్వచ్ఛంద సంస్థ PDSA, దానికి గోల్డ్ మెడల్ ప్రదానం చేసింది. సాధారణంగా ధైర్యసాహసాలు ప్రదర్శించే కుక్కలకు ఇచ్చే ఆ మెడల్‌ను అందుకున్న మొదటి ఎలుకగా మగావా చరిత్ర సృష్టించింది. మగావా 2021లో తన విధుల నుంచి పదవీ విరమణ పొంది, 2022 లో ఎనిమిదేళ్ల వయస్సులో మరణించింది. అయినప్పటికీ, ఒక చిన్న జీవి ఎంత పెద్ద మార్పును తీసుకురాగలదో చెప్పడానికి మగావా జీవితం ఒక గొప్ప ఉదాహరణ. వేలాది మంది ప్రజలు ఈ రోజు దక్షిణాఫ్రికాలో తమ పొలాల్లో భయం లేకుండా తిరుగుతున్నారంటే అది మగావా పుణ్యమే!

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దమ్ముంటే పట్టుకోరా షెకావత్.. అంటూ పోలీసులకు దొంగ సవాల్‌ !!

ఉబెర్‌ డ్రైవర్‌ నిజాయితీ.. నెటిజన్ల సెల్యూట్‌!

కోట్ల ఏళ్ల క్రితం మీ ఊరు ఎక్కడుందో చెప్పేసే ఆన్‌లైన్ టూల్

రెండేళ్ల పిల్లాడిని అడవిలో వదిలేసిన తండ్రి..కారణం ఇదే!

నడిరోడ్డుపై చిరుత ప్రత్యక్షం.. వాహనదారులు పరుగులు

Follow Us