Viral Video: బర్గర్లు ఫ్రీ గా ఇవ్వలేదని కేసు నమోదు.. చివరకు ఏమైందంటే...!! ( వీడియో )
Lahore Fast Food Staff Arre

Viral Video: బర్గర్లు ఫ్రీ గా ఇవ్వలేదని కేసు నమోదు.. చివరకు ఏమైందంటే…!! ( వీడియో )

|

Jun 17, 2021 | 10:16 PM

పోలీసులు లంచాలు తీసుకుంటారని అప్పుడప్పుడు వార్తల్లో చూస్తుంటాము. మరి కొంత మంది డబ్బులు కాకుండా వస్తువులు తీసుకుని డబ్బులు చెల్లించకుండా వెళ్తుంటారని వింటుంటాం.

పోలీసులు లంచాలు తీసుకుంటారని అప్పుడప్పుడు వార్తల్లో చూస్తుంటాము. మరి కొంత మంది డబ్బులు కాకుండా వస్తువులు తీసుకుని డబ్బులు చెల్లించకుండా వెళ్తుంటారని వింటుంటాం. అయితే అందరు పోలీసులు అలాగే ఉంటారనుకోవడం పొరపాటు. పోలీసుల్లో మంచోళ్లు కూడా ఉంటారు. కానీ, చెడ్డ పోలీసుల వల్ల మొత్తం పోలీస్ వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుంటుంది. ఇక తాజాగా పాకిస్థాన్‌లోని లాహోర్‌లో కొంత మంది పోలీసులు ‘జానీ అండ్‌ జుగ్ను’ అనే రెస్టారెంట్‌లో బర్గర్లు ఆర్డర్‌ చేశారు. అయితే అవన్నీ ఉచితంగా ఇవ్వాలని కోరారు. ఇందుకు రెస్టారెంట్ సిబ్బంది నిరాకరించారు. దీంతో వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మా మాటనే వినరా.. అంటూ ఆ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న 19 మంది సిబ్బందిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు పోలీసులు. వారిలో కిచెన్ సిబ్బంది కూడా ఉన్నారు. దీంతో ఆ హోటల్‌ను మూసివేయాల్సి వచ్చింది.

YouTube video player

 

మరిన్ని ఇక్కడ చూడండి: Karate Player Selling Tea: కుటుంబ పోషణకు చాయ్‌వాలాగా మారిన ప్రపంచ కరాటే ఛాంపియన్‌.. ( వీడియో )

Viral Video: గూగుల్ డూడుల్ పోటీలో విజేతకు షాక్.. వీడియో కాల్ చేసిన సుందర్ పిచాయ్