వామ్మో.. ఒంగోలులో దెయ్యమట !! జుట్టు విరబోసుకుని.. ఏడుస్తూ..

|

Dec 10, 2024 | 10:15 AM

అర్దరాత్రి… చిమ్మ చీకటి… నగరానికి దూరంగా ఓ ముగ్గురు యువకులు మద్యం మత్తులో జోగుతూ బైక్‌పై వెళుతున్నారు… మద్యం మత్తు చాలదన్నట్టు అంతకు మించి మత్తిచ్చే మత్తుపదార్ధాల కోసం నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతానికి వచ్చారు… ఎప్పుడూ లేని విధంగా ఓ భయంకరమైన అనుభవం వారికి ఎదురైంది… హఠాత్తుగా జుట్టు విరబోసుకుని, భయంకరంగా ఉన్న రూపంతో ఓ స్త్రీ వీరి బైక్‌కు ఎదురొచ్చింది…

రౌద్రంగా చూస్తూ, ఏడుస్తూ, కేకలు వేస్తూ… రా… రావాలయ్యా… నువు కావాలయ్యా… రా, రా… అంటూ పెడబొబ్బలు పెట్టింది… ఈ హఠాత్పరిణామంతో బిత్తరపోయిన ఆ యువకులు భయపడుతూనే బైక్‌ హెడ్‌లైట్‌ వెలుతురులో ఫోటోలు తీశారట… వీడియో రికార్డింగ్‌ చేశారట… సర్కులేట్ అవుతున్న ఫోటోలు అంత స్పష్టంగా లేవు… అయితే ఆ ఫోటోలు చూస్తే ఎవరైనా జడుసుకుని చావాల్సిందే… ఆ ఫోటోలు రాంగోపాలవర్మ దెయ్యం సినిమాలో కన్నా భయంకరంగా ఉన్నాయి… వీడియో మాత్రం లైటింగ్‌ లేక చీకటిగా ఉంది కానీ, ఆ స్త్రీ ఏడుపులు, పెడబొబ్బలతో సృష్టించిన బీభత్సం మాత్రం రికార్డయింది. తనంటే భయం లేకుండా ఫోటోలు, వీడియోలు తీస్తున్న ఆ ముగ్గురు యువకులపై ఆ స్త్రీ ఒక్క ఉదుటున వారిపై లంఘించిందట… ఓ యువకుడి చేతిని, కాళ్ళను కండలు ఊడేలా కోరికేసిందట… దీంతో దెబ్బకు మత్తు దిగిపోయి ఆ యువకులు తమను దెయ్యం వెంటాడిందని భావించి ప్రాణభయంతో పరుగులు పెట్టారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘హై-రిస్క్‌ ఫుడ్‌’ కేటగిరీలో మినరల్‌ వాటర్‌