దొంగ కరెంటు వాడుకున్న మాజీ సీయం !! షాకిచ్చిన సర్కారు
కరెంటోల్లకు తెల్వకుంట తంబాల మీదికి వైర్లేశి దొంగ కరెంటి వాడుకుంటరుగదా కొంతమంది..? గన్పతి నవరాత్రులు, అమ్మవారి నవరాత్రులప్పుడుగూడ పర్మిషన్ తీస్కోని ఫ్రీ కరెంటి వాడుకునేటోల్లు మునుపు.... అయితె అసంటోల్లు వాడుకున్నరంటె ఏమో అన్కోవచ్చుగనీ.. రాష్టానికి ముఖ్యమంత్రి లెక్క పన్జేశిన గీ సారోల్లుగూడ మొన్న దివ్వెల పండుగకు దొంగ కరెంటి వాడుకున్నరటనుల్లా.. సూడుర్రి ఎవలో? ఆ.. ఇగ సూశిర్రా ఈ ఇంటికేశిన కరెంటి బుగ్గల డెక్రేషనెట్లుందో?
కరెంటోల్లకు తెల్వకుంట తంబాల మీదికి వైర్లేశి దొంగ కరెంటి వాడుకుంటరుగదా కొంతమంది..? గన్పతి నవరాత్రులు, అమ్మవారి నవరాత్రులప్పుడుగూడ పర్మిషన్ తీస్కోని ఫ్రీ కరెంటి వాడుకునేటోల్లు మునుపు…. అయితె అసంటోల్లు వాడుకున్నరంటె ఏమో అన్కోవచ్చుగనీ.. రాష్టానికి ముఖ్యమంత్రి లెక్క పన్జేశిన గీ సారోల్లుగూడ మొన్న దివ్వెల పండుగకు దొంగ కరెంటి వాడుకున్నరటనుల్లా.. సూడుర్రి ఎవలో? ఆ.. ఇగ సూశిర్రా ఈ ఇంటికేశిన కరెంటి బుగ్గల డెక్రేషనెట్లుందో? లైట్ల ఎల్తురుకు శీకట్లగూడ శెక్కున పగటీలి కానొచ్చినట్టు కానొస్తుంది మొత్తం. ఇంట్లె, బైట మొత్తం కరెంటే కరెంటు.. ఒక్కపూట వాడితెనే రొండొందల యూనిట్ల కరెంటి కర్సయ్యేతట్టుందిలే.. ? వాడుకుంటె మనకేంది వాల్లకేగదా బిల్లు వాశిపొయ్యేది అనుకుంటుర్రేమొ.. ఇంత కరెంటి వాడుకున్నా ఒక్కరూపాయ్ బిల్లు రాదు.. ఎందుకంటె ఇదంత తంబం మీదికేలి వైర్ గుంజి వాడుకుంటున్న దొంగ కరెంటి మరి.. ఇంతకు ఎవలిల్లో తెల్సా ఇది.? కర్నాటక మాజీ సీయం కుమారస్వామి సారోల్ల ఇల్లుల్లా.. మొన్న పండుగపూట ఇంటికిట్ల లైట్ బుగ్గలతోని డెక్రేషన్ చేశి.. డైరెక్టుగ తంబం మీదికేలి వైర్లు గుంజి కనెక్షన్ తీస్కున్నరట.. ఈ ముచ్చట కనిపెట్టినోల్లు ఎవలో వీడియో తీశి సోషల్ మీడియాల వెడ్తె.. కర్నాటకల కరెంటి ఇల్లే అని అప్పట్ల కుమారసామి సారు వెట్టిన పోస్టును తీశి పోస్టర్ లెక్క మార్చిట్ల ఇజ్జత్ తీస్తున్నరు..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
18 ఏళ్లుగా 45000 కిలోమీటర్లు సైకిల్ తొక్కాడు..
వైరైటీగా ఓట్ల ప్రచారం.. నలుగురు కలసి తాతకు స్నానం
చచ్చిపోతున్నా.. దెయ్యమై నా కుటుంబాన్ని కాపాడుకుంటా!
ఛీ.. అంత లగ్జరీ షిప్లో ప్రయాణిస్తూ.. ఏంటి తల్లీ ఈ పాడుపని!
వర్క్ ఫ్రం హోమ్ కాదు..వర్క్ ఫ్రం ట్రాఫిక్!
ఇలా చేస్తే.. మీ పర్సుని ఎవరూ టచ్ కూడా చేయలేరు!
17 రోజుల మాతృవేదన.. ప్రపంచాన్ని కదిలించిన తల్లి తిమింగలం కథ!
డైనోసార్లను తుడిచిపెట్టిన గ్రహశకలం..
ప్లాట్‌ఫామ్‌పై ఉన్న బస్సును ఎత్తుకెళ్లిన దొంగ.. చివరికి ఇలా..

