Kacha Badam Song: విదేశాల్లో మోత మోగిస్తున్న కచ్చా బాదం సాంగ్‌.. కచ్చా బాదం పాటకు అదిరి పోయే స్టెప్పులేసిన కిలీపాల్‌..

|

Mar 03, 2022 | 7:35 PM

ఇన్‌స్టాగ్రామ్‌ లో యాక్టివ్‌గా ఉంటే యూజర్స్ క్రేజీగా వైరల్ అవుతున్న బెంగాలీ హిట్ సాంగ్ కచ్చా బాదమ్‌ను ఖచ్చితంగా వినే ఉంటారు. ప్రస్తుతం ఈ సాంగ్ ఇంటర్నెట్‌లో తుఫానుగా మారింది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన పాటలలో ఒకటిగా నిలిచింది. తాజాగా ప్రముఖ టాంజానియా


ఇన్‌స్టాగ్రామ్‌ లో యాక్టివ్‌గా ఉంటే యూజర్స్ క్రేజీగా వైరల్ అవుతున్న బెంగాలీ హిట్ సాంగ్ కచ్చా బాదమ్‌ను ఖచ్చితంగా వినే ఉంటారు. ప్రస్తుతం ఈ సాంగ్ ఇంటర్నెట్‌లో తుఫానుగా మారింది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన పాటలలో ఒకటిగా నిలిచింది. తాజాగా ప్రముఖ టాంజానియా ఇన్‌స్టాగ్రామర్ కిలీ పాల్ తన సోదరి నీమా పాల్‌తో కలిసి ఈ హిట్ సాంగ్‌కి కాలు కదిపాడు. మూడు రోజుల క్రితం అప్‌లోడ్ చేసిన ఈ వీడియోను ఇప్పటికే మిలియన్ల మంది వీక్షించారు. ఈ వైరల్ వీడియోలో, కిలీ తన సోదరి నీమాతో కలిసి కచ్చా బాదం పాటకు అద్భుతంగా డాన్స్‌ చేశాడు. ఈ అన్నాచెల్లెళ్లు ఇద్దరూ ఎంతో పర్‌ఫెక్ట్‌గా హుక్ స్టెప్ వేవారు. ఇది నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. “ప్రతి ఒక్కరూ ఈ డ్యాన్స్‌ని చూడాలనుకుంటున్నారు. కనుక ఇది ఉత్తమమైన వీడియో అంటూ కిలీ వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు. నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ అన్నాచెల్లెళ్ల డాన్స్‌పై నెటిన్లు ప్రశంసల కామెంట్లు కురిపిస్తున్నారు. “పర్ఫెక్ట్ డ్యాన్స్ బ్రో” , “గ్రేట్ బ్రదర్… మీ సోదరి చాలా అందంగా ఉంది” అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. నిజానికి పశ్చిమ బెంగాల్‌కు చెందిన భుబన్ బద్యాకర్ అనే వేరుశెనగ వ్యాపారి పాడిన ఈ కచా బాదంను పాడాడు. ఈ సాంగ్ కు మరింత పాపులరీటీ తెచ్చింది మాత్రం గాయకుడు, సంగీతకారుడు నజ్ము రీచత్. ఇప్పుడు ఈ పాటకు విదేశీయులు సైతం ఫిదా అవుతున్నారు.

మరిన్ని చూడండి ఇక్కడ:
Puneeth Rajkumar-James: ఆయనకి సాటి మరొకరు లేరు.. అభిమానుల గుండెల్లో చిరస్థాయి.. వైరల్ అవుతున్న చివరి సినిమా పోస్టర్స్…

Rana Daggubati: విభిన్న పాత్రలకి కేరాఫ్ అడ్రస్ ఆయన.. బళ్లాళ దేవ అయినా.. డానియెల్ శేఖర్ అయినా..! ట్రెండ్ మార్చిన ‘రానా’ ఫొటోస్

Rashmika Mandanna: కొంటె చూపులతో కవ్విస్తున్న ‘శ్రీవల్లి’.. గ్లామర్ డోస్‌లో ‘తగ్గేదేలే’.. ఎట్రాక్ట్ చేస్తున్న ఫోటోలు..

Jacqueline Fernandez: అబ్భురపరిచే వయ్యారాలతో చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ ‘జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌’..ఫొటోస్