దోశలు, ఆమ్లెట్లు అడగొద్దు.. క్యాంటీన్లలో ‘క్లోజ్డ్’బోర్డ్స్
ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ తన క్యాంటీన్ మెనూలో కోతలు విధించింది. LPG సరఫరా సమస్యలతో దోశ, ఆమ్లెట్ వంటివి తాత్కాలికంగా నిలిపివేసింది. బయోఫ్యూయల్ వాడకంపై దృష్టి సారిస్తోంది. ఇంధన ఆదాకు ఉద్యోగులు ఇంటి నుండి పని చేయాలని ప్రోత్సహిస్తోంది. ఇతర ఐటీ సంస్థలు కూడా WFHకు మొగ్గు చూపుతున్నాయి. మధ్యప్రాచ్య అనిశ్చితి, ఇంధన సంక్షోభం ఐటీ రంగంపై ప్రభావాన్ని చూపుతోంది.
కొన్నాళ్లు క్యాంటీన్లలో దోశ, ఆమ్లెట్ అడగకండి… ఇదీ ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు పంపిన ఈమెయిల్ సందేశం. క్యాంటీన్లలో అందించే ఫుడ్ మెనూలో ఇన్ఫోసిస్ కోతలు పెట్టింది. బెంగళూరు, పుణె, చెన్నై ఇతర నగరాల కార్యాలయాల్లో మార్చి 12 నుంచి కోతలు అమల్లోకి వస్తాయని సంస్థ తెలిపింది. ఇకపై లైవ్ కుకింగ్ కౌంటర్లు మూసివేస్తున్నట్లు ఇన్ఫోసిస్ తెలిపింది. దోశ, ఆమ్లెట్ వంటి అధిక మంటపై చేసే వంటకాలు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని ఎల్‌పీజీ సరఫరా సక్రమంగా జరగక ఫుడ్ కోర్టు నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారని ప్రస్తుతానికి పరిమిత మెనూనే అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఎల్‌పీజీకి ప్రత్యామ్నాయంగా బయోఇంధనాన్ని ఉపయోగించుకోవడంపై దృష్టి పెడుతున్నట్లు మెయిల్‌లో రాసుకొచ్చింది. సాధ్యమైనంత వరకూ ఇంటి నుంచే ఆహార పదార్ధాలు తెచ్చుకోవాలని ఉద్యోగులను కోరింది. కొన్నేమో వర్క్ ఫ్రం హోమ్‌కూ అవకాశం కల్పిస్తున్నాయి. ఇంధనాన్ని ఆదా చేసేందుకు సాధ్యమైనంత మంది ఉద్యోగులకు ఇంటి నుంచి పనికి అవకాశం కల్పించాలని వెల్స్‌ఫార్గో, హెచ్‌సీఎల్ టెక్ సూచించింది. గత ఏడాది చివరికి ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్‌లలో వరుసగా 3,37,000; 2,26,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వేల మంది ఉద్యోగులు రోజూ సుదూర ప్రాంతాల నుంచి కార్యాలయాలకు వస్తూ, భారీ మొత్తంలో ఇంధనాన్ని ఖర్చు చేస్తున్నారని, ఈ ప్రయాణాలను తగ్గిస్తే.. ఆ ఇంధనాన్ని ఆరోగ్య సంరక్షణ, అత్యవసర సేవలు, లాజిస్టిక్స్, ప్రజా రవాణా వంటి కీలక సేవలకు బదలాయించవచ్చని కంపెనీలు ఆలోచిస్తున్నాయి. పశ్చిమాసియా దేశాల్లో ఇప్పటికే వ్యాపారాలు ఉన్న లేదా కొత్తగా ప్రారంభించాలని భావిస్తున్న కంపెనీలు, పెరుగుతున్న అనిశ్చితి తో సీనియర్ స్థాయి నియామకాలను నిలిపివేస్తున్నట్లు గ్లోబల్ సెర్చ్ కంపెనీలు చెబుతున్నాయి. ఇంధనం, స్థిరాస్తి, నిర్మాణం, లాజిస్టిక్స్ వంటి రంగాలపై యుద్ధ ప్రభావం పడటంతో, పశ్చిమాసియా ప్రాంతంలో సంబంధం ఉన్న కంపెనీల బోనస్‌లపై ఒత్తిడి పడొచ్చని కన్సల్టింగ్ కంపెనీలు హెచ్చరిస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇద్దరు పెళ్లి కొడుకుల ఎంట్రీతో.. పెళ్లిలో ఊహించని ట్విస్ట్..
