Viral Video: టీచర్‌ బదిలీతో విద్యార్థుల కన్నీరు మున్నీరు.. వినూత్నంగా వీడ్కోలు చెప్పిన స్టూడెంట్స్.. వీడియో చూసి షాక్ అవుతున్న నెటిజన్లు..

Updated on: Mar 05, 2022 | 7:58 AM

జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత మన అభివృద్ధిని కోరుకునేది మనకు పాఠాలు చెప్పిన గురువులు మాత్రమే. వారు తరగతి పాఠాలను కాకుండా జీవిత పాఠాలను కూడా మనకు నేర్పిస్తారు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరికీ ఒక ఫేవరేట్‌ టీచర్‌ ఒకరుంటారు. వారు వేరొక చోటుకు బదిలీ కావడం


జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత మన అభివృద్ధిని కోరుకునేది మనకు పాఠాలు చెప్పిన గురువులు మాత్రమే. వారు తరగతి పాఠాలను కాకుండా జీవిత పాఠాలను కూడా మనకు నేర్పిస్తారు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరికీ ఒక ఫేవరేట్‌ టీచర్‌ ఒకరుంటారు. వారు వేరొక చోటుకు బదిలీ కావడం లేదా రిటైర్‌ అయిపోయినప్పుడు వారికి ఘనంగా వీడ్కోలు పలకడానికి ఎన్నో ఏర్పాట్లు చేస్తాం. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. కోల్‌కతాలోని 24 పరగణా ప్రాంతంలో కటియాహట్ బికేఏపీ అనే బాలికల పాఠశాలలోని ఓ టీచర్‌కు ఉన్నట్టుండి వేరే చోటికి బదిలీ అయింది. ఆ స్కూలు పిల్లలకు ఆ టీచర్‌ అన్నా.. ఆమె టీచింగ్‌ అన్నా ఎంతో ఇష్టం. అయితే తమకు ఎంతో ఇష్టమైన టీచర్‌కు ట్రాన్స్‌ఫర్‌ అయిందని తెలుసుకున్న విద్యార్థులు ఒక్కసారిగా ఆవేదనకు గురయ్యారు. ఈ క్రమంలోనే తమకు ఎంతో ఇష్టమైన టీచర్‌కు వినూత్నంగా వీడ్కోలు పలకాలని భావించారు.ఇందు కోసం విద్యార్థులు టీచర్‌ కళ్లకు గంతలు కట్టి ఆమెను పాఠశాల మైదానం లోకి తీసుకెళ్లారు. అప్పుడు విద్యార్థినులందరూ మోకాళ్లపై కూర్చొని షారుఖ్‌ ఖాన్‌ నటించిన ‘రబ్​నే బనాదీ జోడి’ సినిమాలోని ఒక పాటను పాడారు. ‘నా కుచ్ మాంగ.. నా కుచ్ పూచా.. తుజ్​ మే రబ్​ దిఖ్​తా హై.. మేడం హమ్ క్యా కరే’ అంటూ ఆలపిస్తూ తమ చేతుల్లోని గులాబీ పువ్వులను టీచర్‌కు అందించారు. కాగా ఈ సందర్భంగా విద్యార్థులందరూ కన్నీరు పెట్టుకోవడంతో ఆ టీచర్‌ కూడా కన్నీరుమున్నీరయ్యారు. విద్యార్థులను ప్రేమగా హత్తుకుని ఓదార్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన వారంతా తమ స్కూల్‌ డేస్‌ గుర్తుకు వస్తున్నాయంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని చూడండి ఇక్కడ:
Puneeth Rajkumar-James: ఆయనకి సాటి మరొకరు లేరు.. అభిమానుల గుండెల్లో చిరస్థాయి.. వైరల్ అవుతున్న చివరి సినిమా పోస్టర్స్…

Rana Daggubati: విభిన్న పాత్రలకి కేరాఫ్ అడ్రస్ ఆయన.. బళ్లాళ దేవ అయినా.. డానియెల్ శేఖర్ అయినా..! ట్రెండ్ మార్చిన ‘రానా’ ఫొటోస్

Rashmika Mandanna: కొంటె చూపులతో కవ్విస్తున్న ‘శ్రీవల్లి’.. గ్లామర్ డోస్‌లో ‘తగ్గేదేలే’.. ఎట్రాక్ట్ చేస్తున్న ఫోటోలు..

Jacqueline Fernandez: అబ్భురపరిచే వయ్యారాలతో చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ ‘జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌’..ఫొటోస్

Published on: Mar 05, 2022 07:58 AM
Loading...
Unable to load recommendations.
Follow Us