AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Want Wife: అవసరమైతే ఎదురుకట్నమిస్తా.. ఆమే నాకు భార్యగా రావాలి..! పోస్టర్ పట్టుకొని రోడ్డెక్కిన వ్యక్తి..

Want Wife: అవసరమైతే ఎదురుకట్నమిస్తా.. ఆమే నాకు భార్యగా రావాలి..! పోస్టర్ పట్టుకొని రోడ్డెక్కిన వ్యక్తి..

Anil kumar poka
|

Updated on: Feb 03, 2023 | 8:27 AM

Share

పూర్వం పిల్లాడు గవర్నమెంట్‌ ఉద్యోగి అయితే కూతురు సుఖపడుతుందని భావించేవారు. అందుకు పెద్దమొత్తంలోనే ముట్టజెప్పి అలాంటి సంబంధాలు వెతికి వెతికిమరీ కుదుర్చుకొని వివాహాలు చేసుకునేవారు. అయితే


మధ్యప్రదేశ్ లోని చింద్వారా ప్రాంతానికి చెందిన వికల్ప్ మాల్వి తనకు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న యువతి భార్యగా రావాలంటూ ఓ రోజు రద్దీగా ఉన్న ఫౌంటెయిన్ చౌక్ వీధిలో పెద్ద ప్లకార్డు పట్టుకుని నిలుచున్నాడు. పసుపు రంగు పేపర్ పై హిందీలో పెద్ద అక్షరాలతో విషయం రాసివుంది. అది చూసి దారిన పోయే వారంతా నవ్వుకుంటూ వెళ్లిపోతున్నారు. ఆ ప్లకార్డులో ‘‘ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న అమ్మాయి నాకు కావాలి. వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను. అటువంటి అమ్మాయికి నేను కట్నం కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను’’ అని రాసి ఉంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక్కడ ట్విస్ట్‌ ఏంటంటే.. నిజంగా వికల్ప్‌ ప్రభుత్వ ఉద్యోగిని వివాహం చేసుకోడానికి ఈ పని చేయలేదట.. సరదాగా అందరినీ కాసేపు నవ్విద్దామని అలా చేశాడట. ఇది విన్నవారు ‘ఓరి నీ యాశాలో..’ అంటూ ఆశ్చర్యపోతున్నారు. కాగా, వికల్ప్‌కి ఇలాంటి ఫన్నీ వీడియోలు చేయడం ఓ హాబీ అట. కాగా నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ వీడియోను వేలాదిమంది నెటిజన్లు వీక్షించారు. వందలాదిమంది లైక్‌ చేస్తూ రకరకరాలుగా స్పందిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Condom: కడుపులో కనిపించిన కండోమ్..! కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి రిపోర్ట్‌ చూసి వైద్యులు షాక్‌.

Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Motehr and Son: నువ్వు సూపర్‌ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్‌ చూడాలని..

Published on: Feb 03, 2023 08:27 AM