బిజీ రోడ్డుపై ఆటో స్టంట్స్.. పోలీసుల ముందే ఓవరాక్షన్‌!

Updated on: Feb 04, 2026 | 3:02 PM

నగరంలోని రద్దీ రహదారులపై స్టంట్లు చేసే వాహనదారుల బెడద రోజురోజుకూ పెరుగుతోంది. యువత మాత్రమే కాకుండా కొందరు ప్రొఫెషనల్ డ్రైవర్లు సైతం ప్రమాదకర విన్యాసాలకు పాల్పడుతూ ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారు. బైకులు, కార్లు మాత్రమే కాదు… ఇటీవల ఆటో డ్రైవర్లు కూడా రోడ్లపై విచ్చలవిడిగా స్టంట్లు చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

తాజాగా ఓ ఆటో డ్రైవర్ బిజీ రోడ్డుపై అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం కలకలం రేపింది. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఆటోను వేగంగా నడుపుతూ అకస్మాత్తుగా పోలీసు వాహనం ముందు ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. దీంతో అక్కడున్న వాహనదారులు ఉలిక్కిపడ్డారు. పోలీసులు కారు దిగి అతడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా, డ్రైవర్ క్షణాల్లోనే జెట్ స్పీడుతో అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రమాదకర స్టంట్లు చేసే డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రోడ్డు భద్రత కోసం పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us