Kidney sale Video: త్యాగమూర్తివయ్య.. కిడ్నీ అమ్మి మరీ భార్యకు ఐఫోన్‌ గిఫ్ట్‌ ఇచ్చిన భర్త(వీడియో వైరల్).

|

Sep 09, 2021 | 9:05 AM

మనిషికి ఆశ ఉండటం మంచిదే.. కానీ అత్యాశ అంతమంచిది కాదు. మన ఆర్థిక పరిస్థితిని బట్టి, ఉన్నదాంట్లో సర్దుకుపోతే.. సమస్యలంటూ ఏమి ఉండవు. కానీ అలా కాకుండా అడ్డగోలుగా ఖర్చులు చేస్తూ.. అప్పుల పాలవుతుంటారు కొందరు. ఇలాంటి సమస్యతోనే సతమతం అవుతున్న ఓ వ్యక్తి తన భార్యకు దిమ్మతిరిగిపోయే షాక్‌ ఇచ్చాడు.

ఆపరేషన్‌ కోసం తన రెండు గాజులూ అమ్ముకోవాల్సి వచ్చింది అనే యాడ్‌ గుర్తుంది కదా. ఇది యాడే అయినా.. ఓ వ్యక్తి నిజ జీవితంలో నిజం చేసి చూపించాడు. అనగనగా ఓ బడ్జెట్‌ పద్మనాభం ఉన్నాడు. ఆస్తి మూరెడు ఆశ బారెడు అన్నట్టుగా ఉంటుంది ఆయన భార్య వాలకం. మామూలు ఫోన్‌కే దిక్కులేదు కానీ ఐఫోన్‌ కొనివ్వమంటూ భర్తను తెగ పోరు పెట్టసాగింది.. అప్పు చేసి కొందామన్నా నమ్మి అంత అప్పు ఇచ్చేవారు లేరు. కిడ్నీ అమ్మి అయినా సరే భార్యకు ఐఫోన్‌ కొనివ్వాలని డిసైడ్‌ అయ్యాడు.

ఓ ఫైన్‌ డే భార్య చేతిలో ఐఫోన్‌ పెట్టాడు. ఆ ఫోన్‌ చేసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయిందామె! ఎగిరి గంతేసింది. తర్వాత బెడ్‌పై కుప్పకూలిన భర్తను చూసి షాకయ్యింది.. ఏం జరిగిందని అడిగింది. ఐఫోన్‌ కొనేందుకు కిడ్నీ అమ్మానని చెప్పాడు. కిడ్నీ అమ్మి కొనమని ఎవరు చెప్పారంటూ కన్నీరు కార్చింది. ఆవేశపడింది.. ఇలా కాసేపు భార్యను ఏడిపించిన అతడు .. అసలు విషయం చెప్పాడు.. ఇదంతా ఫేక్‌ అని, డ్రామా అని బ్యాండేజ్‌ తీసేశాడు. డబ్బు కూడబెట్టి ఫోన్‌ కొన్నానని చెప్పుకొచ్చాడు. అయితే ఐఫోన్‌ కోసం నువ్వు పదే పదే పోరు పెడుతున్నప్పుడు తనకు ఇదే ఆలోచన వచ్చిందన్నాడు భర్త. కానీ అలా కాకుండా డబ్బును పోగు చేశానని, ఇకపై అయినా.. మన ఆర్థిక పరిస్థితులు, మన స్తోమతను అర్థం చేసుకుని వస్తువులను ఆశపడటం మంచిదని భార్యకు బోధించాడా భర్త.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: 24 ఏళ్ల తర్వాత లిఫ్ట్‌ తలుపులు తెరిచిన ఆస్పత్రి సిబ్బంది.. లోపలేముందో చూస్తే షాక్‌ ! (వీడియో)

Ants in aircraft: ఫ్లైట్ జర్నీలో జాగ్రత్త..! విమానంలో భయపెట్టిన ఎర్ర చీమల దండు..!వీడియో వైరల్

Afghanistan Crisis Live Video: ఆఫ్ఘనిస్థాన్ మహిళలపై పెరిగిన అరాచకాలు.. తాలిబన్లపై తిరగబడ్డ మహిళ..!(వీడియో).

Ashu Reddy-RGV video: బ్యూటీ బోల్డ్ ఇంటర్వ్యూలో రచ్చ.. ఆర్జీవికి ముద్దు పెట్టిన అషు రెడ్డి(వీడియో).