Train Cleaning Video: రైలు బోగీలను ఎలా క్లీన్ చేస్తారో తెలుసా..! స్పెషల్ వీడియో..

Updated on: Mar 10, 2023 | 9:14 AM

రోజూ లక్షలాదిమంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే రైలును ఎలా శుభ్రం చేస్తారనే విషయం చాలామందికి తెలియదు. ప్రయాణం ప్రారంభించే ముందు రైలు బోగీలన్నీ నీట్ గా ఉంటాయి..

రోజూ లక్షలాదిమంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే రైలును ఎలా శుభ్రం చేస్తారనే విషయం చాలామందికి తెలియదు. ప్రయాణం ప్రారంభించే ముందు రైలు బోగీలన్నీ నీట్ గా ఉంటాయి. ప్రయాణంలో మురికిగా, అపరిశుభ్రంగా మారిన బోగీలను గతంలో కాంట్రాక్ట్ సిబ్బంది శుభ్రం చేసేవారు. ఒక్కో బోగీని కొంతమంది సిబ్బంది చకచకా క్లీన్ చేసేవారు. దీనివల్ల ఇటు ఖర్చు, అటు సమయం కూడా ఎక్కువే ఎక్కువ తీసుకుంటుంది. తాజాగా ఈ పని కోసం రైల్వే శాఖ కొన్ని పెద్ద స్టేషన్లలో ఆటోమేటిక్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన వీడియోను రైల్వే శాఖ ట్విట్టర్ లో పోస్టు చేసింది.రైలు బోగీలను గతంలో శుభ్రం చేసిన విధానాన్ని, ఇప్పుడు ఎలా చేస్తున్నారనేది ఈ వీడియోలో రైల్వే శాఖ చూపించింది. గతంలో సిబ్బంది చేతులతో, కెమికల్స్ ను ఉపయోగించి వాటర్ తో శుభ్రం చేసేవారని వివరించింది. ప్రస్తుతం ఈ పని కోసం ఆటోమేటెడ్ రైల్వే కోచ్ వాషింగ్ ప్లాంట్‌ ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. రైలును ఈ ప్లాంట్ ద్వారా తీసుకెళితే పట్టాల పక్కనే అమర్చిన పొడవైన స్క్రబర్లు బోగీలను శుభ్రం చేయడం వీడియోలో చూడొచ్చు. ఈ వీడియోను ట్వీట్ చేస్తూ ‘హ్యాండ్ ప్రెస్ నుంచి సిస్టమాటిక్ స్విచ్ వరకు’ అంటూ రైల్వే శాఖ క్యాప్షన్ పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Ranbir Kapoor: సెలబ్రిటీ లైఫ్ ఈజీ కాదంటున్న రణబీర్.. ఏమైయింది అంటే..? వీడియో

Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్‌ ఇచ్చిన బన్నీ.. వీడియో.

Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!

Published on: Mar 10, 2023 09:14 AM
Follow Us