బైకులను ఢీకొట్టి ఫర్నిచర్ షాపులోకి దూసుకెళ్లిన కారు.. సీసీటీవీలో భయానక దృశ్యాలు!

Updated on: Nov 01, 2026 | 5:55 PM

సంగారెడ్డి జిల్లా: సదాశివపేటలో స్కార్పియో వాహనం బీభత్సం సృష్టించింది. అదుపుతప్పిన కారు మొదట డివైడర్‌ను ఢీకొట్టి, అనంతరం రోడ్డుపై వెళ్తున్న రెండు బైకులను ఢీకొట్టింది. అక్కడితో ఆగకుండా వేగంగా దూసుకెళ్లి ఓ ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రమాద ధాటికి రెండు బైకులు పూర్తిగా దెబ్బతినగా, ఫర్నిచర్ షాపులోని వస్తువులు ధ్వంసమయ్యాయి.

సంగారెడ్డి జిల్లా: సదాశివపేటలో స్కార్పియో వాహనం బీభత్సం సృష్టించింది. అదుపుతప్పిన కారు మొదట డివైడర్‌ను ఢీకొట్టి, అనంతరం రోడ్డుపై వెళ్తున్న రెండు బైకులను ఢీకొట్టింది. అక్కడితో ఆగకుండా వేగంగా దూసుకెళ్లి ఓ ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రమాద ధాటికి రెండు బైకులు పూర్తిగా దెబ్బతినగా, ఫర్నిచర్ షాపులోని వస్తువులు ధ్వంసమయ్యాయి. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదానికి సంబంధించిన భయానక దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Nov 01, 2026 05:53 PM
Loading...
Unable to load recommendations.
Follow Us