Romania bison: అడవి దున్నలు కాలుష్యాన్ని అడ్డుకుంటాయా.? పరిశోధనలో విస్తుపోయే నిజాలు..

Updated on: Jun 15, 2024 | 2:23 PM

గాల్లో కాలుష్యం పెరుగుతోంది. వాతావరణంలోకి భారీగా కార్బన్ డైఆక్సైడ్ విడుదలై భూమి వేడెక్కేందుకు కారణమవుతోంది. మరి క్లైమేట్ ఛేంజ్ ను ఎలా ఆపాలి? దీనిపై సైంటిస్టులు ఎంతో కాలంగా పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా వారికో సమాధానం దొరికింది. రొమేనియాలోని తార్కు పర్వతాల్లో కేవలం 170 యూరోపియన్ అడవిదున్నలు భారీ స్థాయిలో కార్బన్ గాల్లో కలవకుండా చూస్తున్నట్లు శాస్ర్తవేత్తలు గుర్తించారు.

గాల్లో కాలుష్యం పెరుగుతోంది. వాతావరణంలోకి భారీగా కార్బన్ డైఆక్సైడ్ విడుదలై భూమి వేడెక్కేందుకు కారణమవుతోంది. మరి క్లైమేట్ ఛేంజ్ ను ఎలా ఆపాలి? దీనిపై సైంటిస్టులు ఎంతో కాలంగా పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా వారికో సమాధానం దొరికింది. రొమేనియాలోని తార్కు పర్వతాల్లో కేవలం 170 యూరోపియన్ అడవిదున్నలు భారీ స్థాయిలో కార్బన్ గాల్లో కలవకుండా చూస్తున్నట్లు శాస్ర్తవేత్తలు గుర్తించారు. ఏటా అమెరికాలో 43 వేల కార్లు విడుదల చేసే సీఓ2కు సమానమైన కార్బన్ మట్టిలోనే ఉండిపోయేలా చేస్తున్నట్లు తాజా పరిశోధనలో గుర్తించారు.

యేల్ స్కూల్ ఆఫ్ ఎన్విరాన్ మెంట్ కు చెందిన పరిశోధకులు రొమేనియాలోని తార్కు పర్వత ప్రాంతాలపై అధ్యయనం చేపట్టారు. ఇందులో భాగంగా యూరోపియన్ అడవిదున్నలు గడ్డి తింటున్న సుమారు 50 చదరపు కిలోమీటర్ల పరిధిలోని గడ్డి మైదానాలను పరిశీలించారు. అక్కడి మట్టి నమూనాలపై అధ్యయనం చేపట్టగా అందులో అదనంగా 54 వేల టన్నుల కార్బన్ నిల్వ అవుతోందట. అంటే ఏటా అమెరికాలో 43 వేల కార్లు లేదా యూరొప్ లో 1.23 లక్షల కార్లు విడుదల చేసే కార్బన్ డైఆక్సైడ్ కు సమానమైన కార్బన్ ఈ నేలలో నిల్వ ఉందట! ఇది ఈ ప్రాంతంలో అడవిదున్నలు లేకపోతే మట్టిలో నిల్వ అయ్యే కార్బన్ దాదాపు 10 రెట్లు ఎక్కువట!

గడ్డి మైదానాల్లో సమాంతరంగా గడ్డి తినడం ద్వారా అడవిదున్నలు అక్కిడి నేలలో పోషకాలు తిరిగి వృద్ధి చెందేందుకు దోహదపడుతున్నాయట. అలాగే గిట్టలతో బలంగా అడుగులు వేయడం ద్వారా గడ్డి విత్తనాలు మట్టిలోకి వెళ్లి తిరిగి జీవం పోసుకొనేందుకు కారణమవుతున్నాయట. తద్వారా మట్టిలో నిల్వ ఉన్న కార్బన్ వాతావరణంలోకి విడుదల కాకుండా చూస్తున్నాయట. ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ ఓస్వాల్డ్ ష్మిట్జ్ ఈ వివరాలను వెల్లడించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Loading...
Unable to load recommendations.
Follow Us