వడదెబ్బ నుంచి రక్షణకు.. మంత్రి చిట్కా..

Updated on: Apr 28, 2026 | 7:49 PM

వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుండి వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ కథనంలో ఉన్నాయి. శరీర ద్రవాలు కోల్పోవడం వల్ల వచ్చే వడదెబ్బ లక్షణాలు, నివారణ మార్గాలు, హైడ్రేటెడ్‌గా ఉండటానికి నీరు, పండ్లు, మజ్జిగ ప్రాముఖ్యత వివరించబడ్డాయి. తేలికపాటి ఆహారం, కెఫిన్, మద్యం నివారణ గురించి తెలుసుకోండి. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సూచించిన విధంగా జేబులో ఉల్లిపాయ పెట్టుకోవడం వంటి ప్రాచీన చిట్కాలపై ప్రత్యేక దృష్టి.

ప్రస్తుతం సూర్యుడు ప్రతాపం చూపెడుతున్నాడు. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయ్‌. కేవలం వేడి పెరగడమే కాదు భానుడి భగభగలకు మన శరీరం తట్టుకోలేక నియంత్రణ కోల్పోయే పరిస్థితి. మన భాషలో చెప్పాలంటే అదే వడదెబ్బ . అధిక ఉష్ణోగ్రతలో ఎక్కువ సమయం గడపడం వల్ల శరీరం ద్రవాలను కోల్పోయి శరీరంలో వేడి విపరీతంగా పెరిగిపోతుంది. వడదెబ్బ తగిలినప్పుడు శరీర ఉష్ణోగ్రత 40°C కంటే ఎక్కువగా ఉంటుంది. తలనొప్పి, వాంతులు, వికారం వంటి లక్షణాలు ఉంటాయి. మామూలుగా అయితే ఎండకు చెమట పడుతుంది. కానీ వడదెబ్బ తగిలితే శరీరం చెమట పట్టడం ఆగిపోతుంది. వడదెబ్బ తగలకుండా ఎండాకాలంలో శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. దాహం వేసినప్పుడు మాత్రమే నీళ్లు తాగకుండా టైమ్‌ పెట్టుకుని ప్రతి గంటకు రెండు గ్లాసులు నీళ్లు తాగుతూ ఉండాలి. పండ్లు, జ్యూస్‌లు, మజ్జిగ వంటివి తీసుకోవాలి. ముఖ్యంగా వేసవిలో చెమట రూపంలో శరీరాన్ని చల్లబరచడానికి నీరు సహాయపడుతుంది. తగినంత నీరు తాగితే ఏకాగ్రత పెరుగుతుంది. తలనొప్పి తగ్గుతుంది. కెఫిన్‌ ఉండే టీ, కాఫీలు తీసుకోకపోవడం మంచిది. ఒకవేళ తీసుకున్నా చాలా తక్కువ తీసుకోవాలి. మద్యం తాగకపోవడం ఉత్తమం. అలాగే భోజనం కూడా భుక్తాయాసం వచ్చేలా చేయకూడదు. ఎక్కువ కారం, మసాలాలు, అధిక చక్కెరలు ఉండే ఆహార పదార్థాలు తీసుకోకూడదు. తేలికపాటి ఆహారం, సాత్వికాహారం, నీటి శాతం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఇక..వేసవిలో వడదెబ్బ నుంచి రక్షించే బెస్ట్‌ చిట్కా ను కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా చెప్పుకొచ్చారు. తాను కారులో లేదా ఇతర చోట్ల ఏసీని ఉపయోగించనని, జేబులో ఉల్లిపాయ పెట్టుకుంటానని జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. వేసవికాలంలో అందరూ జేబులో ఉల్లిపాయ పెట్టుకోవాలని సూచించారు. ఎండవేడిని తట్టుకోవడానికి తాను ప్రాచీన భారతీయ పద్ధతిని పాటిస్తానని అన్నారు. ఎండలో ప్రయాణించే సమయంలో కండువా లేదా టోపీతో తలను కప్పుకోవడం, జేబులో ఉల్లిపాయ ఉంచుకోవడం చేస్తానని అన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇంధన కొరత వేళ ఉచితంగా పెట్రోలు పంపిణీ.. ఎక్కడంటే

100 అడుగుల నోట్ల దండ.. నిచ్చెన ఎక్కి మరీ.. మెడలో వేసుకున్న వరుడు

అమ్మ ప్రేమకు భాష లేదు.. కదిలించిన దృశ్యం !!

ముంచుకొస్తున్న సూపర్ ఎల్ నినో.. మానవాళికి డెత్ వారెంట్.. !

పార్క్‌లో వాకింగ్‌ చేస్తున్నారా.. పన్ను కట్టాల్సిందేనా? అసలేం జరిగింది?

Follow Us