Emotional Video: నెటిజన్లను కంటతడి పెట్టిస్తున్న చిన్నారి వీడియో.. తాతయ్యను విడిచి వెళ్లలేక చిన్నారి ఆవేదన..

Updated on: Mar 11, 2022 | 8:53 AM

సోషల్ మీడియాలో ఎన్నో వైరల్‌ వీడియోలు చూస్తుంటాం. కానీ ఈ వీడియోలో ఒక చిన్నారి అమాయకపు ప్రేమకు మీరు కూడా కన్నీరు పెట్టుకుంటారు. సోషల్‌ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో చిన్నారి కారు వెనుక సీటులో కూర్చొని ఉంది. బయటి నుంచి తన తాతయ్య చిన్నారికి సెండాఫ్‌ ఇస్తున్నారు.


సోషల్ మీడియాలో ఎన్నో వైరల్‌ వీడియోలు చూస్తుంటాం. కానీ ఈ వీడియోలో ఒక చిన్నారి అమాయకపు ప్రేమకు మీరు కూడా కన్నీరు పెట్టుకుంటారు. సోషల్‌ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో చిన్నారి కారు వెనుక సీటులో కూర్చొని ఉంది. బయటి నుంచి తన తాతయ్య చిన్నారికి సెండాఫ్‌ ఇస్తున్నారు. చిన్నారి తన తాతయ్యకు ఫ్లైయింగ్‌ కిస్‌ ఇస్తోంది. తన తాతయ్యను విడిచి వెళ్లడం ఇష్టంలేకపోవడంతో దీనంగా బైబై చెప్తూ… ఆమె తన కన్నీళ్లను ఆపుకోలేకపోయింది. తాతయ్యను విడిచి వెళ్లడం తప్పదని తెలిసి వెక్కి వెక్కి ఏడ్చేసింది. ఆ పాప తన తాతతో ఎంతటి అనుబంధాన్ని పెంచుకుందో వీడియో చూస్తుంటే అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతూ నెటిజన్లతో కంటనీరు పెట్టిస్తోంది. ఈ వీడియోలో ఉన్న మూడేళ్ల కామీ అనే చిన్నారికి తన ఇన్‌స్టా ఖాతాలో 131 వేల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. ఆమె తల్లి, కోలెట్ లూయిస్, ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను నిర్వహిస్తుంది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోకు “మీరు మీ బెస్ట్ ఫ్రెండ్, తాతని విడిచిపెట్టవలసి వచ్చినప్పుడు” అంటూ క్యాఫ్షన్ అందించారు. ఈ వీడియో చూస్తున్న నెటిజన్లు తమ భావాలను కామెంట్ల రూపంలో పంచుకుంటున్నారు. “ఇది నన్ను కంటతడి పెట్టించింది. స్వీటెస్ట్ మోస్ట్ ఆరాడబుల్ బేబీ ఏంజెల్” అంటూ ఓ యూజర్ కామెంట్ చేశాడు.

మరిన్ని చూడండి ఇక్కడ:

Prabhas-Radhe Shyam: ‘యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్’ ఫ్యాన్స్.. ‘రాధేశ్యామ్’ నుంచి డార్లింగ్ హై క్వాలిటీ ఫొటోస్ మీ కోసం..

Varsha Bollamma: పాప ఎక్స్‌ప్రెషన్స్‌‌కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..! కుర్రోళ్లకు కునుకు లేకుండా చేస్తున్న ‘వర్ష’ క్యూట్ ఫొటోస్..

Ashika Ranganath: కన్నడ ఇండస్ట్రీను షేక్ చేసి టాలీవుడ్ ఎంట్రీకు సిద్హమవుతున్న ‘అషికా రంగనాధ్’.. ఎట్రాక్ట్ చేస్తున్న ఫొటోస్..

Sitara Ghattamaneni: మహేశ్ తనయ క్యూట్‌ స్టిల్స్‌.. అప్పుడే యాక్టింగ్‌ మొదలెట్టిందా..!

Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్‌ ఇంత అందమా..! మెస్మరైజ్ చేస్తున్న ప్రగ్యా లేటెస్ట్ ఫొటోస్..

Puneeth Rajkumar-James: ఆయనకి సాటి మరొకరు లేరు.. అభిమానుల గుండెల్లో చిరస్థాయి.. వైరల్ అవుతున్న చివరి సినిమా పోస్టర్స్…

Rana Daggubati: విభిన్న పాత్రలకి కేరాఫ్ అడ్రస్ ఆయన.. బళ్లాళ దేవ అయినా.. డానియెల్ శేఖర్ అయినా..! ట్రెండ్ మార్చిన ‘రానా’ ఫొటోస్

Rashmika Mandanna: కొంటె చూపులతో కవ్విస్తున్న ‘శ్రీవల్లి’.. గ్లామర్ డోస్‌లో ‘తగ్గేదేలే’.. ఎట్రాక్ట్ చేస్తున్న ఫోటోలు..

Loading...
Unable to load recommendations.
Follow Us