హైదరాబాద్‌లో బీచ్.. సముద్ర తీరాన్ని తలదన్నేలా ఏర్పాట్లు వీడియో
విశ్వనగరం వైపు శరవేగంగా అభివృద్ధి బాటలో పరుగులు పెడుతున్న హైదరాబాద్‌కు ఇన్నాళ్లు ఒకే ఒక్క వెలితి వేధిస్తుండేది. అదే బీచ్.. హైదరాబాద్‌కు బీచ్ లేకపాయే అని నగరవాసులు ఇప్పటికీ తెగ బాధపడిపోతుంటారు. సముద్ర తీర ప్రాంతం అంటేనే మనసుకు ఎంతో ఉల్లాసాన్ని కలిగిస్తుంది.
అలలతో ఆడుకోవడం, ఇసుక తిన్నెలపై వాకింగ్, బీచ్ ఒడ్డున సన్ బాత్ ఇలా బీచ్‌కు ఉండే స్పెషాలిటీయే వేరు. అదో ప్రత్యేక అనుభూతి. అందుకే భాగ్యనగరవాసులు తరచుగా గోవా, కేరళ, విశాఖపట్నం వంటి సముద్ర తీర ప్రాంతాలకు టూర్ వేస్తూ ఉంటారు. ఇక డబ్బులున్న వారు విదేశాల బీచ్‌లను కూడా సందర్శిస్తుంటారు. అయితే తెలంగాణ వచ్చిన కొత్తలో నాటి టీఆర్‌ఎస్ ప్రభుత్వం హైదరాబాద్‌కు బీచ్‌ను తీసుకొస్తామంటే అంతా నవ్వుకున్నారు. సముద్రమే లేని చోట బీచ్ ఎలా సాధ్యమంటూ ఎగతాళి కూడా చేశారు. అయితే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో బీచ్ ఏర్పాటుకు ప్రయత్నిస్తుండటం మరింత ఆసక్తిగా మారింది. ఆర్టిఫిషియల్ బీచ్‌ను ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలోనే నగర శివారులోని కొత్వాల్‌గూడలో ఆర్టిఫిషియల్ బీచ్ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
మరిన్ని వీడియోల కోసం :
ఏఐతో ఓ యూజర్ సంభాషణ.. షాక్‌తిన్న చాట్‌జీపీటీ.. ఏం జరిగిందంటే..
వింత ఘటన.. నీలం రంగులో గుడ్డు పెట్టిన నాటు కోడి వీడియో
17వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. ‘తల్లికి వందనం’ అమలు చేయాలంటూ డిమాండ్ వీడియో
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
