Gold rings gift: ఈరోజు పుట్టే పిల్లలకు అక్కడ గోల్డ్ రింగ్ ఇస్తారట..! పూర్తి వివరాలు ఈ వీడియోలో…
తమిళనాడు సీఎం స్టాలిన్ సాదాసీదాగా ఉంటారు. ఎప్పుడూ సింపుల్‌గా ఉండటానికి ఇష్టపడే ఆయన పుట్టిన రోజున కూడా హంగూ ఆర్భాటాలేమీ పెద్దగా ఉండవు. అయితే ఆయన పార్టీ నేతలు మాత్రం ఆయన పుట్టిన రోజును ఘనంగా నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో
తమిళనాడు సీఎం స్టాలిన్ సాదాసీదాగా ఉంటారు. ఎప్పుడూ సింపుల్‌గా ఉండటానికి ఇష్టపడే ఆయన పుట్టిన రోజున కూడా హంగూ ఆర్భాటాలేమీ పెద్దగా ఉండవు. అయితే ఆయన పార్టీ నేతలు మాత్రం ఆయన పుట్టిన రోజును ఘనంగా నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పేదలకు సాయం చేసే విషయంలో భారీ ప్రకటనలు గుప్పిస్తున్నారు. పనిలో పనిగా ఆ పార్టీకి చెందిన తిరువళ్లూరు జిల్లా కన్వీనర్ మరో అడుగు ముందుకేసి.. స్టాలిన్ జన్మించిన మార్చి 1న జన్మించే పిల్లలకు ఏకంగా బంగారు ఉంగరాలను బహూకరిస్తానంటూ సంచలన ప్రకటన చేశారు. అయితే ఇక్కడ ఒక కండిషన్ కూడా పెట్టారు.. అదేంటంటే… జిల్లా పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించే పిల్లలకే ఈ గోల్డ్ రింగులు ఇస్తానని ఆయన ఓ కండీషన్ పెట్టారు. తిరువళ్లూరు జిల్లా పరిధిలోని తిరుత్తణిలో సోమవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో డీఎంకే జిల్లా కన్వీనర్ భూపతి గోల్డ్ రింగుల విషయాన్ని ప్రకటించారు. సీఎం జన్మదినం రోజున భారీగా వేడుకలు నిర్వహించడంతో పాటుగా పేదలకు చేతనయినంత మేర సాయం చేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Sitara Ghattamaneni: మహేశ్ తనయ క్యూట్ స్టిల్స్.. అప్పుడే యాక్టింగ్ మొదలెట్టిందా..!
Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్ ఇంత అందమా..! మెస్మరైజ్ చేస్తున్న ప్రగ్యా లేటెస్ట్ ఫొటోస్..