Love Marriage Video: “లవ్ మ్యారేజ్’ కోసం రమ్మంటున్న అమ్మాయిలు.. అబ్బాయిలు ఓపెన్‌ ఆఫర్‌ వదులుకోకండి.. వీడియో

|

Mar 10, 2022 | 9:44 AM

ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకునే వారు తమ గ్రామానికి రావొచ్చని ప్రకటించారు. కానీ, కండిషన్స్‌ ఉన్నాయంటున్నారు..అవును మీరు వింటున్నది నిజమేనండోయ్‌...బ్రెజిల్‌లోని నోయివా డొ కోర్డెరోకు సంబంధించిన ఓ ప్రకటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది..


ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకునే వారు తమ గ్రామానికి రావొచ్చని ప్రకటించారు. కానీ, కండిషన్స్‌ ఉన్నాయంటున్నారు..అవును మీరు వింటున్నది నిజమేనండోయ్‌…బ్రెజిల్‌లోని నోయివా డొ కోర్డెరోకు సంబంధించిన ఓ ప్రకటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది..ఇదేంటంటే..మా గ్రామంలోని అమ్మాయిలకు పెళ్లి కొడుకులు కావలెను. మీ నైపుణ్యం, తెలివితేటలు ఉపయోగించి ఇక్కడి అమ్మాయిలను ప్రేమించి పెండ్లి చేసుకునే సదుపాయం కూడా కలదు. పేరుకు మాత్రమే ప్రేమిస్తే సరిపోదు.. ఇరుపక్షాలు ఒప్పుకొంటేనే వివాహం జరుగుతుంది. అయితే, వివాహం తర్వాత మా గ్రామంలో ఉండాలంటే మాత్రం అబ్బాయిలకు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి’ అంటూ ప్రకటించింది. ఇంత ఓపెన్ ఆఫర్ ఇచ్చారు.. అక్కడి అమ్మాయి మరీ స్వేఛ్చను కోరుకుంటున్నారేమో అనే సందేహం అక్కర్లేదండోయ్. వారు బారెడు పొద్దెక్కేవరకు నిద్రపోయి.. బెడ్ కాఫీ తాగే బ్యాచ్ అస్సలు కాదు. కోడి కూయక ముందే నిద్ర లేచి పనులు చేసే బ్యాచ్. అవును.. వారు పలుగు, పార పట్టుకుని పొలం పనులకు సైతం వెళ్తారు. తమ పనులను తాము చేసుకుంటారు. కుటుంబానికి, బంధాలకు, బంధుత్వాలకు ఎనలేని మర్యాద, గౌరవం ఇస్తారు. ఇంత పని చేస్తారు మోటుగా ఉంటారేమో అని సందేహం కూడా అస్సలు వద్దు ఈ గ్రామంలోని అమ్మాయి అచ్చం దేవకన్యల మాదిరిగా ఉంటారు. అలాంటి అమ్మాయిలు తమకు సరైన జోడీ ఎక్కడా అని వెతుకుతున్నారు. ఇకపోతే,ఇలాంటి అమ్మాయలు పెళ్లి చేసుకోవడానికి పట్టిన షరతులు ఏంటంటే..ఇక్కడి అమ్మాయిలను పెండ్లి చేసుకోవాలంటే.. ముఖ్యంగా మూడు షరతులు. ఏ ఒక్కటి అతిక్రమించినా మళ్లీ ఇంటిబాట పట్టాల్సిందే. ఇంతకీ ఆ కండిషన్లు ఏమిటంటే? ఒకటి.. వంట. రెండు.. అంట్లు తోమడం, బట్టలు ఉతకడం. మూడు.. టాయిలెట్‌ కడగడం. ‘ఓసోస్‌! అదెంత పని. అవన్నీ మాకు వచ్చు కదా’ అంటారేమో.. ఆ మూడింటినీ మీ ఒంట్లో సత్తువ ఉన్నంత కాలం చేయాలి. అక్కడి అమ్మాయిలు స్వతంత్రులు. ఏ పనిచేసినా ఆలూమగలు కలిసే చేయాలి. లింగ భేదం ఉండదు. ఏ బాధ్యతైనా సమానంగా పంచుకోవాల్సిందే. అమ్మాయి వంట చేస్తే, అబ్బాయి కూరగాయలు తరగాలి. అబ్బాయి వంట చేస్తే అమ్మాయిలు స్వచ్ఛందంగా కాయగూరలు తరుగుతారు. ఎన్ని బట్టలున్నా ఇద్దరూ కలిసే ఉతకాలి. టాయిలెట్‌ క్లీనింగ్‌ బాధ్యత మాత్రం అబ్బాయిలదే. మరి ఇవన్నీ ఒకే అయితే బ్రెజిల్‌లోని నోయివా డో కోర్డెరో గ్రామానికి వెళ్లి.. అక్కడి అమ్మాయిల మనసును గెలిచి మనువాడొచ్చు.

మరిన్ని చూడండి ఇక్కడ:

Prabhas-Radhe Shyam: ‘యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్’ ఫ్యాన్స్.. ‘రాధేశ్యామ్’ నుంచి డార్లింగ్ హై క్వాలిటీ ఫొటోస్ మీ కోసం..

Varsha Bollamma: పాప ఎక్స్‌ప్రెషన్స్‌‌కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..! కుర్రోళ్లకు కునుకు లేకుండా చేస్తున్న ‘వర్ష’ క్యూట్ ఫొటోస్..

Ashika Ranganath: కన్నడ ఇండస్ట్రీను షేక్ చేసి టాలీవుడ్ ఎంట్రీకు సిద్హమవుతున్న ‘అషికా రంగనాధ్’.. ఎట్రాక్ట్ చేస్తున్న ఫొటోస్..

Sitara Ghattamaneni: మహేశ్ తనయ క్యూట్‌ స్టిల్స్‌.. అప్పుడే యాక్టింగ్‌ మొదలెట్టిందా..!

Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్‌ ఇంత అందమా..! మెస్మరైజ్ చేస్తున్న ప్రగ్యా లేటెస్ట్ ఫొటోస్..

Puneeth Rajkumar-James: ఆయనకి సాటి మరొకరు లేరు.. అభిమానుల గుండెల్లో చిరస్థాయి.. వైరల్ అవుతున్న చివరి సినిమా పోస్టర్స్…

Rana Daggubati: విభిన్న పాత్రలకి కేరాఫ్ అడ్రస్ ఆయన.. బళ్లాళ దేవ అయినా.. డానియెల్ శేఖర్ అయినా..! ట్రెండ్ మార్చిన ‘రానా’ ఫొటోస్

Rashmika Mandanna: కొంటె చూపులతో కవ్విస్తున్న ‘శ్రీవల్లి’.. గ్లామర్ డోస్‌లో ‘తగ్గేదేలే’.. ఎట్రాక్ట్ చేస్తున్న ఫోటోలు..