ఎన్నికల్లో ‘గ్యాస్’ బాయ్ పోటీ..పేదల కోసమే మరోసారి బరిలోకి
సాటి మనిషికి సహాయ పడాలనే ఆలోచన, పట్టుదల, ఓడినా వెనకడుగు వేయని ఆత్మస్థైర్యం, ఇవన్నీ ఓ సాధారణ గ్యాస్ డెలివరీ బాయ్ 20 ఏళ్లుగా ఎన్నికల్లో పోటీ చేయడానికి కారణమయ్యాయి. ఒక్కసారి కూడా గెలవకపోయినా కష్టపడి మళ్లీ మళ్లీ బరిలోకి దిగేలా చేశాయి. దీనికి ఆయన భార్య పశు పోషణ చేస్తూ మద్దతు ఇస్తోంది. బిహార్‌లోని కిషన్‌గంజ్‌కు చెందిన ఛోటేలాల్ మహతో గ్యాస్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఆయన గ్యాస్ డెలివరీ చేస్తూనే, నిస్సహాయులకు సహాయం చేసేవాడు.
సాటి మనిషికి సహాయ పడాలనే ఆలోచన, పట్టుదల, ఓడినా వెనకడుగు వేయని ఆత్మస్థైర్యం, ఇవన్నీ ఓ సాధారణ గ్యాస్ డెలివరీ బాయ్ 20 ఏళ్లుగా ఎన్నికల్లో పోటీ చేయడానికి కారణమయ్యాయి. ఒక్కసారి కూడా గెలవకపోయినా కష్టపడి మళ్లీ మళ్లీ బరిలోకి దిగేలా చేశాయి. దీనికి ఆయన భార్య పశు పోషణ చేస్తూ మద్దతు ఇస్తోంది. బిహార్‌లోని కిషన్‌గంజ్‌కు చెందిన ఛోటేలాల్ మహతో గ్యాస్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఆయన గ్యాస్ డెలివరీ చేస్తూనే, నిస్సహాయులకు సహాయం చేసేవాడు. ఛోటేలాల్లోని సేవా గుణాన్ని గమనించిన స్థానికులు ఎన్నికల్లో పోటీ చేయాలని సలహా ఇచ్చారు. దీంతో 2000వ సంవత్సరంలో మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు ఛోటేలాల్కు 23 ఏళ్ల వయసే. అయితే వయసు తక్కువగా ఉండటం వల్ల నామినేషన్ రద్దు చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తేనె ఎప్పుడు తీసుకోవాలో తెలుసా ?? ఆ సమయంలో సేవిస్తే తిరుగుండదట