Viral Video: కుండ తయారు చేసిన వ్యక్తికి మొక్కాలి.. రాయితో కొట్టినా పగలని ఉట్టి.. వీడియో
కృష్ణాష్టమి రోజున జరిగిన ఓ సంఘటనకు సంబంధించిన ఫన్నీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఉట్టి కొట్టేందుకు పై వరకు చేరుకున్న కొందరు యువకులు ఆ కుండను పగలగొట్టడానికి..
కృష్ణాష్టమి రోజున జరిగిన ఓ సంఘటనకు సంబంధించిన ఫన్నీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఉట్టి కొట్టేందుకు పై వరకు చేరుకున్న కొందరు యువకులు ఆ కుండను పగలగొట్టడానికి.. తీవ్రంగా ప్రయత్నించారు. ఏకంగా ఓ రాయితో ఉట్టి కొట్టేందుకు ప్రయత్నించినా.. ఆ కుండ మాత్రం పగలలేదు. తొలుత ఓ యువకుడు రాయితో కుండను పగలగొట్టేందుకు ప్రయత్నించాడు. కానీ ఆ ఉట్టి పగలపోవడంతో.. మరో యువకుడు కూడా ప్రయత్నించాడు. ఆ యువకుడైనా ఉట్టి కొడతాడమోనని గ్రామస్తులు ఈలలు, కేరింతలు వేస్తూ ఉత్సాహ పరిచారు. కానీ అతడికి కూడా నిరాశే ఎదురైంది. రెండు చేతులతో పట్టుకుని బలంగా కొడుతున్నా ఆ కుండ కొంచెం కూడా పగలలేదు. దీంతో గ్రామస్తులంతా పగలబడి నవ్వారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Clay Ganesha: బల్బులో మట్టి వినాయకుడు తయారు చేసిన మెదక్ జిల్లా యుకుడు.. వీడియో
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ సంచలన నిర్ణయం.. పాఠ్యాంశంగా కరోనా వైరస్.. వీడియో