నరహంతక బంటి..ఎట్టకేలకు చిక్కింది

Updated on: Feb 14, 2026 | 11:45 AM

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలను వారం రోజులుగా గజగజ వణికించిన నరహంతక ఎలుగుబంటి ఎట్టకేలకు అటవీశాఖకు చిక్కింది. మనుషులపై పడి వేటాడటమే కాకుండా, ప్రాణాలు తీసి శవాల మీద నాట్యం చేస్తూ భయభ్రాంతులకు గురిచేసిన ఈ ఎలుగుబంటిని పట్టుకునేందుకు అటవీ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించారు.

మహారాష్ట్రలోని కిన్వట్ తాలూకా దయాల్ ధన్నూర్ గ్రామ శివారులో రైతులు పొలం పనులు చేసుకుంటున్నారు. ఇంతలో ఎక్కడినుంచి వచ్చిందో ఓ ఎలుగుబంటి ఒక్కసారిగా రైతులపై విరుచుకుపడింది. ఈ భీకర దాడిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన ఆరుగురు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలానికి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో జరగడంతో అటు తెలంగాణ అటవీశాఖ కూడా అప్రమత్తమైంది. భయాందోళనలో ఉన్న ప్రజలను రక్షించేందుకు మహారాష్ట్ర అటవీశాఖ 30 మంది సభ్యులతో కూడిన బృందాన్ని రంగంలోకి దించింది. నిపుణులైన స్నైపర్ల సాయంతో 18 గంటల పాటు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. ఎట్టకేలకు గన్ ద్వారా మత్తుమందు ఇచ్చి, ఆ భయానక ఎలుగుబంటిని బంధించి బోనులో వేశారు. ప్రస్తుతం ఆ ఎలుగుబంటిని ప్రత్యేక సంరక్షణ కేంద్రానికి తరలించడంతో ఇరు రాష్ట్రాల సరిహద్దు గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న క‌వ‌లల పేర్లకు ఉన్న అర్థాలు ఇవే..!

బంగారాన్ని మించిపోయిందే.. ఈ కలప కొనాలంటే కోట్లు పెట్టాల్సిందే!

బురదలో తేలుతున్న వెండి.. జనం వేట చూస్తే షాక్ అవ్వాల్సిందే!

సొంతకారులో ఉత్సాహంగా ఇంటికి వెళ్తున్న యువకుడు..అంతలోనే..

హాస్టల్‌లో ఉండటానికి భయపడుతున్న విద్యార్థులు.. ఎందుకంటే?