Flying Object: గాల్లో ఎగిరి వచ్చిన వస్తువు.. బైక్‌పై ఉన్న వ్యక్తి అదృశ్యం.. ఎం జరిగిందో తెలియని అయోమయం వీడియో..
బైక్స్ అంటే ఎవరికైనా క్రేజీనే. అది కూడా మంచి స్పోర్ట్స్ బైక్‌పై లాంగ్ రైడ్ వెళ్లడం అంటే ఇష్టపడని వాళ్లు ఎవరు ఉంటారు చెప్పండి. అయితే బైక్‌పై వెళ్లేటప్పుడు ఏ చిన్న తప్పిదం జరిగినా, ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా..
బైక్స్ అంటే ఎవరికైనా క్రేజీనే. అది కూడా మంచి స్పోర్ట్స్ బైక్‌పై లాంగ్ రైడ్ వెళ్లడం అంటే ఇష్టపడని వాళ్లు ఎవరు ఉంటారు చెప్పండి. అయితే బైక్‌పై వెళ్లేటప్పుడు ఏ చిన్న తప్పిదం జరిగినా, ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా.. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. వేగంగా వెళ్లేటప్పుడు మాత్రం చిన్న ప్రమాదం కూడా ఊహించని నష్టాన్ని మిగిలిస్తుంది. ఇదిగో ఇలాంటి ఘటననే ఒకటి చోటుచేసుకుంది. బైక్‌పై వేగంగా వెళ్తున్న ఒక వ్యక్తిని గాలిలోంచి ఎగిరి వచ్చిన ఒక వస్తువు తగిలింది. దాని బారి నుంచి తప్పించుకునే వ్యవధి కూడా అతడికి లేకపోయింది. అతడు ఉన్న వేగం ధాటికి బైక్ పై నుంచి వెనక్కి ఎగిరిపడ్డాడు. బైక్ మాత్రం అదే వేగంతో కొంతదూరం నేరుగా దూసుకుంటూ వెళ్లింది. రోడ్డు పక్కన ఉన్న ఫుట్ పాత్‌ని ఢీకొని పడిపోయింది. ఈ ఘటనలో బైక్ రైడర్ బైక్‌పై నుంచి పడిపోయిన తీరు చూస్తే.. అతడు దాదాపు అదృశ్యమయినట్టుగానే కనిపించింది. ఆ బైక్ వెనకే వస్తున్న మరో వాహనంలోని డాష్‌బోర్డ్ కెమెరాలో ఈ దృశ్యం రికార్డ్ అయ్యింది. ఈ యాక్సిడెంట్ తర్వాత బైక్ రైడర్ కి ఏమైంది అనేది ఈ వీడియోలో రికార్డ్ అవలేదు. కానీ ప్రమాదం జరిగిన తీరు చూస్తే.. ప్రమాదం తీవ్రత ఎక్కువే ఉంటుందనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..