Viral Video: ఒక వ్యక్తి అమ్మాయితో చాటింగ్‌.. 6 గంటలు ఆగిన విమానం.. అదేంటి అనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసం..

Updated on: Sep 01, 2022 | 9:57 PM

ఓ అబ్బాయి.. అమ్మాయి మధ్య సరదాగా జరిగిన ఓ మొబైల్‌ చాటింగ్ సంభాషణ.. 185 మందిని భయభ్రాంతులకు గురిచేసింది. టేకాఫ్ అవ్వాల్సిన విమానాన్ని ఏకంగా ఆరు గంటల పాటు నిలిపేసింది. అదేంటీ..


ఓ అబ్బాయి.. అమ్మాయి మధ్య సరదాగా జరిగిన ఓ మొబైల్‌ చాటింగ్ సంభాషణ.. 185 మందిని భయభ్రాంతులకు గురిచేసింది. టేకాఫ్ అవ్వాల్సిన విమానాన్ని ఏకంగా ఆరు గంటల పాటు నిలిపేసింది. అదేంటీ.. విమానం ఆలస్యమవ్వడానికి ఆ చాటింగ్‌కు సంబంధం ఏంటనుకుంటున్నారా? ఓ వ్యక్తి తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి మంగళూరు ఎయిర్‌పోర్టుకు వచ్చాడు. అబ్బాయి ముంబయి వెళ్లేందుకు.. అమ్మాయి బెంగళూరు వెళ్లేందుకు విమాన టికెట్లు బుక్‌ చేసుకున్నారు. ముంబయి వెళ్లే విమానం రాగానే అబ్బాయి వెళ్లి విమానంలో కూర్చున్నాడు. అమ్మాయేమో తన విమానం కోసం ఎదురుచూస్తోంది. బోర్‌ కొడుతుంది అనుకున్నారేమో ఇద్దరూ మొబైల్‌లో చాట్‌ చేసుకున్నారు. ఈ సందర్భంగా విమానాల్లో భద్రత గురించి సరదాగా మాట్లాకుంటూ ‘నువ్వే ఓ బాంబర్‌’ అంటూ ఆ అమ్మాయి.. అబ్బాయికి మెసేజ్‌ చేసింది.ఆ మెసేజ్‌ సరిగ్గా విమానంలో అబ్బాయి వెనుక సీట్లో కూర్చున్న తోటి ప్రయాణికురాలి కంట్లో పడింది. దీంతో భయాందోళనకు గురైన ఆ ప్రయాణికురాలు వెంటనే విమాన సిబ్బందికి సమాచారమిచ్చారు. వారు ఎయిర్‌ట్రాఫిక్‌ కంట్రోలర్‌ను అప్రమత్తం చేశారు. దీంతో టేకాఫ్ అవ్వాల్సిన విమానం ఆగిపోయింది. విమానాశ్రయ సిబ్బంది వెంటనే ప్రయాణికులందరినీ దించేసి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అందులో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కన్పించలేదు. దీంతో ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకున్నారు.

Liger HD Stills And Posters: రౌడీ హీరో ఫ్యాన్స్ కి అలెర్ట్.. లైగర్ హెచ్ డి పోస్టర్స్ అండ్ స్టిల్స్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు..

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girl letter to Modi: పెన్సిల్‌ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?

Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..

Published on: Sep 01, 2022 09:44 PM
Loading...
Unable to load recommendations.
Follow Us