పైకి చూస్తే చెరుకు తోట.. లోపలికెళ్ళి చూసిన పోలీసులకు.. మాములు సెటప్ కాదుగా

|

Sep 08, 2022 | 9:45 AM

మాంచి స్కెచ్ వేశారు. చెరుకు తోటలో సెటప్ పెట్టారు. అయినప్పటికీ అడ్డంగా బుక్కయ్యారు. సాధారణంగా 'తులసివనంలో గంజాయి మొక్క' అనేది నానుడి.

మాంచి స్కెచ్ వేశారు. చెరుకు తోటలో సెటప్ పెట్టారు. అయినప్పటికీ అడ్డంగా బుక్కయ్యారు. సాధారణంగా ‘తులసివనంలో గంజాయి మొక్క’ అనేది నానుడి. కానీ మనోళ్లు కొంచెం కొత్తగా ఆలోచించి చెరకు తోటలో సెటప్‌ పెట్టారు. మహారాష్ట్ర లోని సాంగ్లీ జిల్లా మిరాజ్ తాలూకా షిపూర్ గ్రామంలో సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో పెంచిన 400 గంజాయి మొక్కలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ సంధ్యారాణి దేశ్‌ముఖ్ టీమ్ ఆకస్మిక తనిఖీలు చేసి గుట్టు రట్టు చేసారు. నందకుమార్ బాబర్ అనే రైతును అదుపులోకి తీసుకున్నారు. అతడికి గ్రామ శివారల్లో ఐదెకరాల భూమి ఉంది. అందులో ఒక ఎకరం చెరకు వేశారు. తాను గంజాయి పండించిన సంగతి ఎవరికీ తెలియకూడదని చెరకు మధ్య అంతర పంటగా గంజాయి వేశాడు. కానీ రహస్య సమచారంతో పోలీసులు రైడ్ చేయడంతో బాగోతం బయటపడింది. కాగా మీరజ్‌ తాలూకాలో పెద్దఎత్తున గంజాయి పంట దొరికిన తొలి ఆపరేషన్‌ ఇదే.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జీవితంలో ఇలాంటి బోటును చూసి ఉండరు !! 60 ఏళ్ల వయసులో గిన్నిస్‌ రికార్డు కొట్టిన హాన్సెన్‌

అనుభవించు రాజా.. పుట్టింది పెరిగింది ఇందుకే.. మనుషులకే అసూయ పుట్టిస్తున్న చింపాంజీ

ప్రేమ పేరుతో వంచన !! మైనర్ బాలికను గర్భవతి చేసి మరీ ??

తాగివచ్చి భార్యను వేధిస్తున్న భర్త.. చివరికి షాకింగ్‌ ట్విస్ట్‌ !!

వీడియో తీసి హీరో అవుదాం అనుకున్న విద్యార్థి !! కట్ చేస్తే ఫ్యూజులు అవుట్

 

Published on: Sep 08, 2022 09:45 AM