తండ్రి ప్రేమ.. కొడుకు హోంవర్క్‌ చేద్దామని ప్రయత్నిస్తే..

Updated on: Jun 02, 2026 | 7:41 PM

తన కుమారుడి చదువుకు సహాయపడాలనే ఉద్దేశంతో బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కృష్ణ పెర్మి ‘అక్షర్’ అనే ప్రత్యేక కీబోర్డ్ యాప్‌ను రూపొందించారు. పూర్తిగా ఆఫ్‌లైన్‌లో పనిచేసే ఈ యాప్ 21 భారతీయ భాషలకు మద్దతు ఇస్తూ యూజర్ల వ్యక్తిగత డేటాను సేకరించదు. ప్రస్తుతం ఐఓఎస్ వినియోగదారులకు ఉచితంగా అందుబాటులో ఉండి డేటా గోప్యతకు కొత్త ప్రమాణంగా నిలుస్తోంది.

తన కుమారుడి హోంవర్క్‌కు సహాయం చేయాలన్న ఒక తండ్రి ఆలోచన.. దేశంలోని 21 భాషల్లో సులువుగా టైపింగ్ చేసుకునే ఒక అద్భుతమైన కీబోర్డ్ యాప్‌ ఆవిష్కరణకు దారితీసింది. బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కృష్ణ పెర్మి రూపొందించిన ఈ ‘అక్షర్’ కీబోర్డ్ యాప్, డేటా గోప్యతకు పెద్దపీట వేస్తూ ప్రస్తుతం అందరి మన్ననలు పొందుతోంది. తన కొడుకు కన్నడ అక్షరాలు ప్రాక్టీస్ చేయడం కోసం ఒక మంచి కీబోర్డ్ యాప్ కోసం కృష్ణ వెతికారు. అయితే మార్కెట్‌లో ఉన్న చాలా యాప్స్ ఇంటర్నెట్‌పై ఆధారపడటం లేదా యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తుండటాన్ని ఆయన గమనించారు. దీంతో పిల్లల డేటాకు రక్షణ ఉండదని భావించి, తానే స్వయంగా ఒక ప్రైవసీ-ఫ్రెండ్లీ కీబోర్డును తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఐఐటీ మద్రాస్‌కు చెందిన ‘ఏఐ4భారత్’ సంస్థ అభివృద్ధి చేసిన ఓపెన్-సోర్స్ టెక్నాలజీ ‘ఇండిక్‌ఎక్స్‌లిట్’ మోడల్‌ను ఉపయోగించి ‘అక్షర్’ యాప్‌ను సృష్టించారు. ఈ యాప్ పూర్తిగా ‘ఆఫ్‌లైన్’ లో పనిచేయడం దీని ప్రత్యేకత. టైపింగ్ కోసం ఇంటర్నెట్ అవసరం లేదు, అలాగే యూజర్ల నుండి ఎలాంటి డేటాను సేకరించదు. ఇంగ్లీషులో టైప్ చేస్తే అది తెలుగు లేదా ఆయా భారతీయ భాషల్లోకి ఖచ్చితత్వంతో మారుస్తుంది. తెలుగు, కన్నడ, తమిళం, హిందీతో సహా మొత్తం 21 భాషలకు మద్దతు ఇచ్చే ఈ యాప్, ప్రస్తుతం ఐఓఎస్ వినియోగదారులకు ఉచితంగా అందుబాటులో ఉంది. ఒక చిన్న వ్యక్తిగత అవసరం కోసం మొదలైన ఈ ప్రయత్నం, ఇప్పుడు లక్షలాది మందికి డిజిటల్ సౌలభ్యాన్ని పెంచే సాధనంగా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రబ్బరు పడవలో 30 గంటల జర్నీ.. కుటుంబాన్ని కలవడం కోసం సాహసం

చెన్నకేశవ స్వామి పాదాల నుంచి ఎర్రని ద్రవం! కలియుగాంతానికి సంకేతమంటూ భక్తుల్లో భయం

భూమి అమ్మి భార్యను చదివించాడు.. టీచర్ ఉద్యోగం రాగానే..

యువ‌త‌లో పెరుగుతున్న పెద్ద పేగు క్యాన్స‌ర్‌.. అప్ర‌మ‌త్తంగా ఉండ‌క‌పోతే ముప్పే

సాధారణ మోడల్.. ‘కొకైన్ క్వీన్’ ఎలా అయింది?

Follow Us