ఊపిరి తీసిన రీల్స్ పిచ్చి.. లైక్స్ కావలి అంటే ప్రాణాలు పోవాల్సిందేనా ??

Updated on: Mar 18, 2026 | 12:57 PM

నేటి యువత సోషల్ మీడియాలో లైకులు, వ్యూస్ కోసం ప్రమాదకరమైన స్టంట్లు చేస్తూ ప్రాణాలను పణంగా పెడుతోంది. ఇది వ్యసనంగా మారడంతో అనేక మంది బలవుతున్నారు. ఇటీవల గుజరాత్‌లో వేగంగా కారు నడుపుతూ లైవ్ స్ట్రీమ్ చేసిన ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. సోషల్ మీడియా పిచ్చి ఎంత ప్రమాదకరమో ఈ ఘటన రుజువు చేస్తోంది, యువత జాగ్రత్తలు తీసుకోవాలి.

లైకుల కోసం ప్రాణాలను పణంగా పెట్టడం.. వ్యూస్ కోసం మృత్యువుతో చెలగాటం ఆడటం నేటి యువతకు ఒక వ్యసనంలా మారింది. ప్రస్తుత ప్రపంచం సోషల్ మీడియాలో జీవిస్తోందనటంలో అతిశయోక్తి లేదు. పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఏ కాస్తా సమయం దొరికినా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌లో కాలం గడిపేస్తున్నారు. చిన్న పిల్లల నుంచి ముసలివాళ్ల వరకు సోషల్ మీడియాకు అడిక్ట్ అయిపోతున్నారు. అంతేకాదు, నెట్టింట ఎలాగైనా ఫేమస్ అవ్వాలని, లైకులు, షేర్లు సంపాదించాలని వింత వింత పనులు చేస్తున్నారు. ప్రమాదకరమైన స్టంట్లు చేస్తూ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. రీల్స్ మోజులో పడి ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలూ మనం నిత్యం వార్తల్లో చూస్తునే ఉన్నాం. అయినప్పటికీ జనాలకు ఈ పిచ్చి వీడటం లేదు. తాజాగా సోషల్ మీడియాలో లైవ్ కోసం స్టంట్లు చేస్తూ ఇద్దరు దారుణంగా దుర్మరణం చెందారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో కారును నడుపుతూ, దాన్ని వీడియో తీసి ఇన్‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌లో పెట్టిన కొద్దిసేపటికే ఘోర ప్రమాదం జరిగింది. గుజరాత్‌‌‌‌లోని జెట్‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌కు చెందిన అవధ్ తివారీ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి కారులో రాత్రిపూట షికారుకు వెళ్లాడు. ఫాలోవర్లకు తన డ్రైవింగ్ స్టంట్లు లైవ్‌గా చూపించడానికి కారును వేగంగా నడిపాడు. తివారీ ఎడమ చేత్తో మొబైల్ పట్టుకుని లైవ్‌ రికార్డ్ చేస్తూ కుడి చేత్తో స్టీరింగ్‌‌‌‌ను పట్టుకుని 120 కిలోమీటర్ల స్పీడుతో కారును పోనిస్తున్నాడు. వెనుక సీటులో కూర్చున్న స్నేహితుడు కూడా కారు స్పీడును షూట్ చేస్తున్నాడు. అతివేగంలో ఉన్న కారు డివైడర్‌‌‌‌ను బలంగా ఢీకొట్టి నుజ్జునుజ్జు అయింది. అవధ్ తివారీ స్పాట్‌‌‌‌లోనే ప్రాణాలు కోల్పోగా, స్నేహితుడు దేవరాజ్ గోసాయి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నో టెన్షన్‌.. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల పంపిణీ షురూ

గ్యాస్ కొరత వేళ.. క్రేజీ ఆవిష్కరణతో ఆకలి తీరుస్తున్న టెక్కీలు..

పైకి నిగనిగలాడే క్యాబేజీలు.. లోపల చూస్తే.. వామ్మో

వీడని సంకల్పం: విరిగిన చేత్తోనే పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థి

విమాన ప్రయాణికులకు అలర్ట్.. గల్ఫ్ దేశాలకు విమానాలు రద్దు

Follow Us