Emotional friendship: స్నేహమంటే ఇదేరా..! కన్నీరు పెట్టిస్తున్న వీడియో.. ఫిదా అవుతున్న నెటిజన్లు..

|

Nov 14, 2021 | 9:24 AM

స్నేహం.. ప్రపంచంలో ప్రేమించని మనిషి ఉంటాడేమో కానీ స్నేహం చేయని మనిషి ఉండరు. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో పై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.. తెగ షేర్ కూడా చేస్తున్నారు.


ఈ వీడియోలో ఓ చిన్నారి ఇల్లు ప్రమాదంలో కాలిపోయింది. ఇల్లు మొత్తం అగ్నికి ఆహుతైంది. అదృష్టవశాత్తు ప్రాణహాని జరగలేదు. అయితే ఆ చిన్నారి ఆడుకునే బొమ్మలు కూడా కాలి బూడిదయ్యాయి. విషయం తెలుసుకున్న ఈ చిన్నారి స్కూల్ ఫ్రెండ్స్ అందరు కలిసి అతడి కోసం బొమ్మలు కొన్నారు. క్లాస్ లో బొమ్మలన్నీ ఉంచి అతడికి సర్ ప్రైజ్ ఇచ్చారు. దాంతో ఈ చిన్నారి సంతోషంతో ఎమోషనల్ అయ్యాడు. ఒక్కసారి మిమ్మల్ని కౌగిలించుకోవాలి ఉంది అని కోరాడు. అంతే ఆ చిన్న పిల్లలంతా కలిసి అతడిని ఆప్యాయంగా హత్తుకున్నారు.

ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో పై నెటిజన్స్ ఎమోషనల్ కామెంట్స్ చేస్తున్నారు. వీడియో కన్నీరు పెట్టిస్తుందని కొందరంటుంటే మరికొంతమంది ఫ్రెండ్ షిప్ కు అసలైన ఉదాహరణ అంటూ కామెంట్ చేస్తున్నారు. “అతడు ఆ బొమ్మలను కనీసం ముట్టుకోకుండా ఓ హగ్ కావాలని అడిగాడు” నిజంగా సూపర్ అని కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని చూడండి ఇక్కడ: Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..

Ram Charan look in RRR: ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్.. సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతున్న ఫొటోస్…

Sreeleela: ఎట్రాక్ట్ చేస్తున్న అందాల చందమామ శ్రీలీల లేటెస్ట్ ఫోటోస్…

Follow us on