Elephant Viral Video: ఈ స్టోరీ లో ఏనుగే దొంగ..! దారికాచి లారీలను దోచేస్తున్న ఏనుగు..!
గతంలో దారి దోపిడీల గురించి విన్నాం.. తాజాగా ఒక ఏనుగు ఇలాంటి పనే చేస్తోంది. దారికాచి తనకు కావాల్సిన ఆహారాన్ని అధికారికంగా దోచుకుంటోంది. ఇందుకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది
గతంలో దారి దోపిడీల గురించి విన్నాం.. తాజాగా ఒక ఏనుగు ఇలాంటి పనే చేస్తోంది. దారికాచి తనకు కావాల్సిన ఆహారాన్ని అధికారికంగా దోచుకుంటోంది. ఇందుకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. థాయిలాండ్‌లో కనిపించిన ఈ దృశ్యాన్ని ఒక వాహనదారుడు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది. ఓ ఏనుగు రహదారి పక్కనే నిలుచుని ఉంది. దారెంట పోయే అన్ని వాహనాలను గమనిస్తోంది. చెరకు లోడ్‌తో వస్తున్న లారీని చూడడటమే అలస్యం.. రోడ్డు మధ్యకు వచ్చిన ఏనుగు ఆ వాహనాలను అడ్డుకుంటుంది. డ్రైవర్ బ్రేక్ చేయగానే వాహనంపై దాడి చేస్తుంది. లారీపై కనిపిస్తున్న చెరకు గడలను తొండానికి పట్టినన్ని తీసుకుని కింద పడేసుకుని తినేస్తోంది. ఆ దారిలో కార్లు, ఇతర వాహనాలు వెళుతుంటే రోడ్డు పక్కనే ఉంటున్న ఎనుగు.. చెరకు లోడ్ తో వాహనం వస్తే చాలు.. దారికాచి చెరకు దోపిడీ చేస్తోంది. రోడ్డు పన్ను వసూలుదారు అనే క్యాప్షన్ ఇచ్చి.. ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Naatu Naatu Song in Oscar 2023: వరల్డ్‌వైడ్‌గా ఆస్కార్ ఫీవర్.. ప్రపంచ వేదికపై తెలుగోడి సత్తా..
Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన బన్నీ.. వీడియో.
Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!