Monkey Viral Video: మందుకొట్టి రోడ్డుపైకి వచ్చి రచ్చ రచ్చ చేసిన కోతి బావ.. వీడియో చూస్తే షాకే..

|

Aug 25, 2022 | 9:51 AM

ఆడపిల్ల అంటే లక్ష్మీదేవి రూపంగా భావించిన ఓ తండ్రి.. తన గారాల పట్టి మొదటి పుట్టిన రోజు వేడుకను ప్రత్యేకంగా నిర్వహించాలనుకున్నాడు. అందుకు వినూత్నంగా ఆలోచించిన అతను కుమార్తె పుట్టిన వేడుకల్లో


సోషల్ మీడియాలో ప్రతిరోజూ అనేక రకాల వీడియోలు మనం చూస్తుంటాం. వాటిలో జంతువులకు సంబంధించినవి కూడా ఉంటాయి. వీటిలో ముఖ్యంగా కోతులకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్‌ అవుతుంటాయి. వాటిని నెటిజన్లు కూడా బాగా ఇష్టపడుతుంటారు. తాజాగా ఓ కోతికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో చెట్టుపై ఓ రెండు కోతులు కూర్చొని ఉన్నాయి. వాటికి ఎక్కడ దొరికిందో మంచి ఖరీదైన మద్యం బాటిల్‌ దొరికింది. అంతే ఎత్తిన బాటిల్‌ దించకుండా గటగటా తాగేశాయి. ఆ తర్వాత రోడ్డుపై పార్క్ చేసిన వాహనాలపై పడ్డాయి. మద్యం మత్తులో కళ్లు మూసుకుపోతున్నప్పటికీ ఆ కార్లపై పడి విధ్వంసం చేశాయి. కార్ల అద్దాలు, నెంబర్‌ ప్లేట్లను పీకిపారేసి నానా రచ్చ చేశాయి. అసలే కోతులు.. ఆపై మందేసిన కోతులు..ఇక రచ్చ ఎలాంటో ఊహించండి.. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఈ వీడియోను వేలాదిమంది వీక్షిస్తున్నారు. అయితే ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇది ఫేక్‌ అనీ, ఉద్దేశపూర్వకంగానే క్రియేట్‌ చేశారంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే వీడియో చూడ్డానికి చాలా ఫన్నీగా ఉందంటున్నారు మరికొందరు.

Liger HD Stills And Posters: రౌడీ హీరో ఫ్యాన్స్ కి అలెర్ట్.. లైగర్ హెచ్ డి పోస్టర్స్ అండ్ స్టిల్స్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు..

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girl letter to Modi: పెన్సిల్‌ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?

Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..

Published on: Aug 25, 2022 09:51 AM