రోడ్డుపై కరెన్సీ నోట్లు విసిరేసి.. ఓ రేంజ్‌లో పోలీస్‌ దొంగా ఛేజింగ్

Updated on: Jun 06, 2026 | 5:08 PM

ఉత్తర్‌ప్రదేశ్‌లో డ్రగ్ స్మగ్లర్లను పట్టుకునేందుకు పోలీసులు చేసిన ఛేజింగ్ సినిమా సన్నివేశాలను తలపించింది. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు నిందితులు హైవేపై రూ.100 నోట్లు విసిరేయడమే కాకుండా కాల్పులకు కూడా తెగబడ్డారు. చివరకు పోలీసులు వారిని చుట్టుముట్టి భారీగా మాదకద్రవ్యాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.

ఉత్తర్‌ప్రదేశ్‌ లోని సోనిభద్ర జిల్లాలో సినిమా స్టైల్ ఛేజింగ్‌ జరిగింది. అక్కడి హైవేపై పోలీసులు వెహికల్ చెక్‌ నిర్వహిస్తున్నారు. అటుగా వచ్చిన ఓ కారు సిగ్నల్స్‌ను పట్టించుకోకుండా మెరుపు వేగంతో దూసుకెళ్లింది. దీంతో అధికారులు కారును పట్టుకునేందుకు ఛేజింగ్‌ మొదలుపెట్టారు. వారిని దారి మళ్లించేందుకు వంద రూపాయల నోట్లు గాల్లోకి ఎగరేసారు నిందితులు. ఆ మధ్యలో పోలీసులపై కాల్పులు కూడా జరిపారు. ఇదేదో సినిమా సీన్ కాదు.. పోలీసులు డ్రగ్‌ స్మగ్లర్లను పట్టుకునే ప్రయత్నంలో భాగం. నిందితులు తమ వాహనంతో పోలీస్‌ కారును పదే పదే ఢీకొట్టారు. దాంతో పోలీసుల కార్‌ ఆగిపోయింది. అక్కడే ఉన్న ప్రదీప్‌ కుమార్‌ అనే వ్యక్తి తన కారును పోలీసులకు ఇవ్వడంతో.. నిందితులను ఫాలో కావడం కొనసాగించారు. పోలీసుల దృష్టిని మళ్లించేందుకు నిందితులు తెలివిగా.. కారులోంచి రోడ్డు పైకి రూ.100 రూపాయల నోట్లను విసిరారు. చివరికి స్మగ్లర్ల వాహనాన్ని పోలీసులు చుట్టుముట్టారు. నిందితులు కాల్పులు జరపగా.. పోలీసులు ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చింది. లుథియానాకు చెందిన ప్రిన్స్‌కు గాయాలయ్యాయి. పోలీసులు అతడిని అరెస్టు చేశారు. మరొక నిందితుడు పరారవగా.. అతడి కోసం గాలిస్తున్నారు. నిందితుల కారును చెక్‌ చేయగా 3 కిలోల నల్ల మందు, 225 కిలోల గసగసాల పొట్టుతో పాటు 50,000 క్యాష్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన సరకు విలువ దాదాపు రూ.49 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. నిందితుడిని విచారించగా ఝార్ఖండ్‌ నుంచి పంజాబ్‌కు డ్రగ్స్‌ రవాణా చేస్తున్నట్లు అంగీకరించాడు. గతంలోను పలుమార్లు డ్రగ్స్‌ రవాణా చేసినట్లు తెలిపాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

90 ఏళ్ల అత్తగారిని బుట్టలో కూర్చోబెట్టి.. నెత్తిన పెట్టుకుని కోడలి పాదయాత్ర!

పక్క ఫ్లాట్‌ను దొంగచాటుగా రికార్డ్ చేస్తూ పట్టుబడ్డ వృద్ధుడు

2027లో AI తుఫాను? మూడేళ్లే టైమ్.. మేలుకోకపోతే మనుగడ కష్టమే

Follow Us