Dog Birthday: శునకం పుట్టినరోజు వేడుకలు.. 5 వేలమంది భారీ విందు.. చుస్తే ఓ మై డాగ్ అనాల్సిందే..

|

Jun 27, 2022 | 9:37 PM

ఊర్లో పెళ్లికి కుక్కలు హడావిడి... ఇది సామెత. కుక్క బర్త్‌ డేకి ఊరంతా హడావిడి ఇది ట్రెండ్. అవును ఈ ట్రెండ్‌నే ఫాలో అయ్యాడు ఓ పెద్దమనిషి. కర్నాటకలోని బెళగావి జిల్లాలో...

ఊర్లో పెళ్లికి కుక్కలు హడావిడి… ఇది సామెత. కుక్క బర్త్‌ డేకి ఊరంతా హడావిడి ఇది ట్రెండ్. అవును ఈ ట్రెండ్‌నే ఫాలో అయ్యాడు ఓ పెద్దమనిషి. కర్నాటకలోని బెళగావి జిల్లాలో… క్రిష్ అనే పెంపుడు కుక్కకు ఓ రేంజ్‌లో బర్త్‌డే చేశారు దాని ఓనర్లు. ఈ సందడిని చూస్తే ఎవరైనా సరే ఓ మై డాగ్ అనాల్సిందే.అవును మరి… బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్న ఈ శునక మారాజుకు… కనకపు సింహాసనమొక్కటే తక్కువైంది. బెళగావి జిల్లా తుక్కనట్టి విలేజ్‌లో శివప్ప అనే పెద్దమనిషి తన కుక్కకు క్రిష్ అనే పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు. అంతేకాదు… ఆ క్రిష్‌గారి బర్త్‌డేని ఝాంఝాంగా సెలబ్రేట్ చేశాడు. 100 కేజీల భారీ సైజ్‌లో కేక్ తెప్పించి, తన క్రిష్‌ చేతులతోనే కట్‌ చేయించుకున్నారు. ఆకాశమంత పందిరి లేకపోయినా ఆ స్థాయిలో డెకరేషనైతే కనిపించిందక్కడ. చిన్నపాటి ఊరేగింపు కూడా జరిగింది. 5 వేల మందిని పిలిచి మంచి భోజనం పెట్టించారు. తన కోసం అందంగా తయారైన కలర్‌ఫుల్ కేక్‌ను కూడా ఆబగా తినేసిందా క్రిష్ అనే శునకరాజం. ఈ పుట్టినరోజు వేడుక వెనుక ఒక ఇంట్రస్టింగ్ రివెంజ్ స్టోరీ కూడా ఉందండోయ్. 20 ఏళ్ల నుంచి పంచాయతీ మెంబర్‌గా ఉన్న ఈ శివప్ప మీద… కుక్కల్లా తిన్నారు అంటూ సీరియస్ కామెంట్ చేసి కించపరిచాడట మరో పంచాయతీ మెంబర్‌. దీన్ని మనసులో పెట్టుకుని… ఇప్పుడు తన కుక్క బర్త్‌డేతోనే అతడికి ఇలా స్ట్రాంగ్ కౌంటరిచ్చాడు క్రిష్‌ ఓనర్ శివప్ప.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Aliens coin: యువకుడికి దొరికిన ఏలియన్స్‌ నాణెం.. సోషల్‌ మీడియాలో కాయిన్‌పై రచ్చ..!

Priest: మహిళ తాకగానే స్పృహ కోల్పోతున్న పూజారి.. ఆస్పత్రిలో నర్సు తాకినా అంతే..

Runner @105: రన్నర్‌@105.. రాంబాయి రూటే సపరేటు.. వీడియో చుస్తే మెచ్చుకోవడం ఖాయం..

Follow us on