Viral Video: నెట్టింట్లో ఫన్నీ వీడియోల హవా నడుస్తోంది. కొన్ని వీడియోలు మనల్ని నవ్విస్తే.. మరికొన్ని వీడియోలు కంటతడి పెట్టిస్తాయి. ఇంకొన్ని మాత్రం షాకిస్తుంటాయి. ఏదేమైనా వైరల్ వీడియోలు మాత్రం మనల్ని కొద్దిసేపు ఆకట్టుకోవడంలో మాత్రం సఫలం అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో మాత్రం కచ్చితంగా షాకిస్తుంది. మనం సాధారణంగా టీవీని ఎలా ఆన్ చేస్తాం. స్విచ్ ఆన్ చేసి రిమోట్‌తో ఆన్ చేస్తాం. ఒకవేళ టీవీలో బొమ్మ సరిగ్గా రాకపోతే ఏం చేస్తారు. మహా అయితే టీవీ ఆఫ్ చేస్తారు లేదా టీవీని చేతితో రెండు దెబ్బలు కొడతారు. ఇది మాములుగా జరిగే పద్ధతి. చాలాసార్లు కూడా చూసే ఉంటాం. కానీ, ఈ వీడియోలో మాత్రం.. ఓ వ్యక్తి టీవీని ఎలా ఆన్ చేశాడో చూస్తే మాత్రం షాకవుతారు. విషయలోకి వెళ్తే.. టీవీ ఆన్ చేసిన వీడియోలోని వ్యక్తి.. అందులో బొమ్మ రాకపోవడంతో కర్ర అందుకున్నాడు. ఎంతకీ బొమ్మ సక్రమంగా రాకపోవడంతో అది ఆ కర్రతో టీవీని బాదడం మొదలు పెట్టాడు. అలా టీవీలో బొమ్మ వచ్చేంత వరకు బాదుతూనే ఉన్నాడు.
అలా నాలుగైదు దెబ్బలు గట్టిగా కొట్టగానే టీవీ ఆన్ అవుతుంది. దీంతో సదరు వ్యక్తి టీవీలో బొమ్మను చూస్తు సంతోషంతో టీవీలో ప్రోగ్రాం చూస్తుండిపోతాడు. ఈ వీడియో ఐ క్యాచింగ్ ప్లస్ అనే ట్విట్టర్ ఖాతా యూజర్ పంచుకున్నాడు. ఈ వీడియోకి ఇప్పటివరకు 38 లైక్‌లు, 11 రీట్వీట్లతో దూసుకపోతోంది.
Done ☑️ pic.twitter.com/uX2LDCtrbv
— EYE CATCHING PLUS (@CatchingPlus) August 1, 2021