Time traveller Prediction: ఉల్కపాతంతో అమెరికా ఖతం.. టైమ్ ట్రావెలర్ హెచ్చరిక సందేశాలు..!

|

Dec 18, 2022 | 9:05 AM

మన భూమి గురించి మన కంటే ఎక్కువగా.. మన ఫ్యూచర్‌ ప్రజలు ఆందోళన చెందుతున్నారా.. తాజా పరిణామాలను చూస్తుంటే అలాగే అనిపిస్తుంది.. భూమిపైకి మరో కొత్త టైమ్ ట్రావెలర్ వచ్చాడు.


మన భూమి గురించి మన కంటే ఎక్కువగా.. మన ఫ్యూచర్‌ ప్రజలు ఆందోళన చెందుతున్నారా.. తాజా పరిణామాలను చూస్తుంటే అలాగే అనిపిస్తుంది.. భూమిపైకి మరో కొత్త టైమ్ ట్రావెలర్ వచ్చాడు. కొన్ని ముఖ్యమైన భవిష్యత్ సంఘటనలు ముందే చెప్పాడట. 2236 సంవత్సరం నుంచి 2022లోకి వచ్చానంటున్న ఈ కొత్త టైమ్ ట్రావెలర్.. భవిష్యత్తుకు సంబంధించి కొన్ని హెచ్చరికలు చేశాడు. వచ్చే పదేళ్లలో ఇవి జరుగబోతున్నట్లు కొన్ని విషయాలు చెప్పాడు. వాటిలో అమెరికాపై భారీ ఉల్క పడుతుందంటున్నాడు. సోషల్ మీడియాలో ఓ ఖాతా తెరిచిన ఇతగాడు.. భవిష్యత్తుకి సంబంధించి తరచూ హెచ్చరిక సందేశాలు పోస్ట్ చేస్తున్నాడు. తాజాగా పోస్ట్ చేసిన వీడియో అందర్నీ భయపెడుతోంది. వచ్చే పదేళ్లలో భయంకరమైన ఘటనలు జరుగుతాయని చెబుతున్నాడు. గ్రహాంతరవాసుల వల్ల తీవ్ర నష్టం జరుగుతుందని హెచ్చరిస్తున్నాడు. అటెన్షన్ అంటూ మొదలైన వీడియోలో.. “నేను నిజమైన టైమ్ ట్రావెలర్‌ని చెప్పకుంటున్నాడు. జరగబోయే సంఘటనల గురించి అలర్ట్ చేయడానికి గతంలోకి వచ్చానని తెలిపాడు. అలాగే 2022లో సైంటిస్టులు.. అంతరించిపోయిన భారీ సముద్ర చేప మెగాలోడొన్‌ను DNA పద్ధతి ద్వారా తిరిగి బతికించే విధానం కనుక్కుంటారనీ, 2023లో దాన్ని సృష్టిస్తారనీ తెలిపాడు. 2025లో రెండు వేర్వేరు గ్రహాలపై జీవులు ఉన్న విషయాన్ని సైంటిస్టులు కనిపెడతారనీ.. ఆ గ్రహాలు మన భూమిపై ఉన్న టెక్నాలజీ కంటే అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో ఉంటాయని వివరించాడు. ఇక 2034లో భూమిపై ఉల్కాపాతం జరుగుతుందనీ.. దాని వల్ల సగం అమెరికా తుడిచిపెట్టుకుపోతుందని చెప్పాడు. ఇక దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది తాము సేఫ్‌గా ఉండేందుకు ఎక్కడ ఉండాలో చెప్పమని కోరుతున్నారట. అయితే ఇదంతా కల్పితమని మరికొందరు కొట్టిరేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Snake Bathing: నువ్వు తోపువి బాసూ.. కింగ్‌ కోబ్రాకి స్నానమా..! మగ్‌పై పలుమార్లు కాటు వేసిన పాము.. వీడియో.

Romance Before Marriage: పెళ్లికిముందే శృంగారం చేస్తే ఇక అంతే..! కొత్త చట్టం తీసుకురానున్న ప్రభుత్వం.

Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్‌ ప్రకటన..

Published on: Dec 18, 2022 09:05 AM