డోర్ లాక్ చేసి మరీ డేంజర్‌ గేమ్..ఈ కుర్రాళ్ల నిర్వాకం చూస్తే షాక్‌ వీడియో

Updated on: May 02, 2025 | 8:41 PM

కొంతమంది యువకులు.. ఓ గదిలో డోర్ లాక్ చేసుకుని వింత గేమ్ స్టార్ట్ చేసారు. గది మధ్యలో రకరకాల టపాసులు పెట్టారు. ఆ తర్వాత గదిలో ఫుట్‌బాల్ పెట్టి దానిపై పెట్రోల్ పోశారు. చివరకు అంతా కలిసి గేమ్ ఆడారు. ప్రాణాలను పణంగా పెట్టి.. సోషల్ మీడియాలో పాపులర్ అయి తీరాల్సిందే అన్నట్లుగా తయారైంది ప్రస్తుత పరిస్థితి. కొందరు ఏదోటి చేసి నెటిజన్ల దృష్టిని ఆకర్షించాలని చూస్తుంటారు.

ఈ క్రమంలో కొందరు ప్రాణంతక విన్యాసాలు చేస్తుంటే.. మరికొందరు ఎదుటి వారిని కూడా ప్రమాదంలోకి నెడుతూ వీడియోలు తీస్తుంటారు. తాజాగా ఈ కుర్రాళ్లు ప్రవర్తించిన తీరు చూసి అంతా షాక్ అవుతున్నారు. డోర్ లాకేసుకుని మరీ గదిలో ఈ గేమ్ స్టార్ట్ చేశారు. కొంతమంది యువకులు కలిసి ఈ గేమ్‌ ఆడారు. పెట్రోల్‌ను మండించగానే ఫుట్‌బాల్‌కు మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత వారంతా కలిసి ఫుట్‌బాల్‌ను అటూ, ఇటూ తన్నారు. అలాగే అక్కడున్న టపాసులకూ నిప్పంటించారు. టపాసులు నుంచి వచ్చే నిప్పు రవ్వలను తప్పించుకుంటూ, ఫుట్‌బాల్ ఆడాలనేది వారి ఉద్దేశం. ఓ వైపు టపాసులు పేలుతుండగా.. మరో వైపు మండుతున్న ఫుట్‌బాల్‌ను తన్నుతున్నారు. ఈ క్రమంలో ఏమాత్రం నిప్పు రవ్వలు మీద పడినా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అయితే అదృష్టవశాత్తు ఎవరికీ ఏమీ కాలేదు.

మరిన్ని వీడియోల కోసం :

నడిరోడ్డు పై గిరినాగు..పడగ విప్పి.. బుసలు కొట్టి..వీడియో

 

ఫ్యామిలీని కాపాడిన “సాల్ట్‌’.. ఉగ్రదాడి నుంచి తృటిలో తప్పుకున్నారు

 

గుండెపగిలే వార్త తెలియక..కుమారుడి రాకకోసం తల్లిదండ్రుల ఎదురుచూపులు..