గ్రిల్స్ మధ్యలో ఇరుక్కున్న కుక్క.. సాయం చేసిన పిల్లి..

Updated on: Sep 22, 2022 | 9:36 AM

ఇటీవల ఇంటర్నెట్‌లో పెంపుడు జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. వాటి చిలిపి చేష్టల నెటిజన్లు కూడా బాగా ఇష్టపడుతున్నారు.

ఇటీవల ఇంటర్నెట్‌లో పెంపుడు జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. వాటి చిలిపి చేష్టల నెటిజన్లు కూడా బాగా ఇష్టపడుతున్నారు. ఎంజాయ్‌ చేస్తున్నారు. తాజాగా ఓ కుక్కపిల్ల, పిల్లిపిల్లకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. బద్దశత్రువులైన ఈ రెండు జంతువులు ఒకరికొకరు ప్రాణమిత్రులుగా మెలుగుతూ నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో కుక్క, పిల్లి స్నేహం అబ్బురపరుస్తోంది. ఇందులో ఓ కుక్క పిల్ల తన స్నేహితుడైన పిల్లి దగ్గరకు వెళ్లాలనుకుంది. కానీ ఆ రెండింటి మధ్య గ్రిల్స్ అడ్డుగా ఉన్నాయి. దాంతో ఆ కుక్క పిల్ల గ్రిల్స్ దాటేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆ గ్రిల్స్ మధ్యలో కుక్క పిల్ల కాళ్లు ఇరుక్కుపోయాయి. వెంటనే అలర్ట్ అయిన పిల్లి.. తన కాళ్ల సాయంతో ఆ కుక్క పిల్లను ముందుకు నెట్టే ప్రయత్నం చేసింది. ఈ ప్రయత్నం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. వీడియోను చూసి ఫిదా అయిపోతున్నారు. అందమైన స్నేహం అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రైల్లో చోరీకి యత్నం.. దొంగకు చుక్కలు చూపించిన ప్రయాణికుడు !!

Published on: Sep 22, 2022 09:36 AM
Loading...
Unable to load recommendations.
Follow Us